వైరల్: దుర్గామాత నిమజ్జన సమయంలో హీరోగా మారిన ఆరేళ్ల బుడ్డోడు..!

పిల్లలు మాట్లాడుతుంటే భలే ముద్దుగా అనిపిస్తుంది కదా.వాళ్ళు మాట్లాడేకొద్దీ వినాలనిపిస్తుంది.

మరి కొంతమంది అయితే అచ్చం పెద్దవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడి అందరిని ఆశ్చర్యపరుస్తారు.వారి మాట తీరు చూస్తే మనకే షాక్ అనిపిస్తుంది.

చుట్టూ ఎంతమంది జనం ఉన్నాగాని భయం లేకుండా వారు చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టేస్తారు.

మరి కొంతమంది చిన్నారులు మాత్రం ఎక్కువమంది ఉన్నప్పుడు మాట్లాడడానికి భయపడిపోతారు.అయితే ఈ వీడియోలో కనిపించే బుడ్డోడు మాత్రం అసలు భయం లేకుండా పోలీసుతో మాట్లాడి అందరిని ఆకట్టుకున్నాడు.

చుట్టూ ఎంత మంది జనం ఉన్నాగాని ఆ పిల్లాడు చెప్పాలనుకున్న విషయాన్ని పోలీసులకు చెప్పేసాడు.

ప్రస్తుతం ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది.పట్టణంలో దుర్గామాత నవరాత్రుల తరువాత అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసే కార్యక్రమాల్లో ఈ బుడ్డోడు అక్కడ హీరోగా మారిపోయాడు.

అది ఎలా అంటే.ఊరేగింపు అంటే పాటలు, డీజె, డప్పుల మోత, డాన్సుల హడావుడి ఉండాలిసిందే కదా.

ఈ క్రమంలోనే దుర్గామాత ఊరేగింపు కార్యక్రమంలో కూడా డీజే పాటలు పెట్టారు.అయితే ఆ పాటలు మోతకు అక్కడికి పోలీసులు వచ్చి డీజె సౌండ్‌ ను పెట్టవద్దని నిర్వహకులకు తెలిపారు.

అలా డీజే సౌండ్‌ పెట్టవద్దని ఎస్సై చెబుతున్న సమయంలో అక్కడే ఉన్న ఒక బుడ్డోడు డీజే ఎందుకు పెట్టకూడదు అంటున్నారు సార్ అంటూ మాట్లాడాడు.

ఇది ఏ పెళ్ళో, పేరేంటమో కాదు సార్ మా దుర్గమ్మ దేవి ఊరేగింపు సార్.

ఎందుకు డీజే పెట్టకూడదో చెప్పండి అంటూ స్థానిక ఎస్సైని ప్రశ్నించాడు.ఇంతకీ ఆ బుడ్డొడి వయసు ఎంత అనుకుంటున్నారు సరిగ్గా ఆరు సంవత్సరాలు ఉంటాయనుకుంటా.

ఎంతో దైర్యంగా ఏది అయితే అది రేపు చూసుకుందాం సార్ ఇప్పుడైతే డీజే పెడుతాం అంటూ పోలీస్ తో చెప్పాడు.

ఆ బుడ్డోడి మాటలకూ పోలీస్ బాస్ సైతం షాక్ అయినట్లు ఉన్నాడు.వాడు అనే మాట్లాడే మాటలు చక్కగా వింటూ అలా నుంచుని ఉన్నాడు.

ఎస్ఐ ముఖంలో కూడా సీరియస్ నెస్ అయితే కనిపించడంలేదు.అక్కడ ఉన్నవారు అందరు పోలీసులతో ఆ బుడ్డోడు అలా మాట్లాడం చూసి షాక్ అయ్యారు.

ఏది ఏమి అయిన ఈ బుడ్డోడి వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారు.?: సీఎం రేవంత్ రెడ్డి