వైరల్: షాకింగ్, ల్యాప్‌టాప్‌కి బదులుగా పార్సిల్‌లో రాయి పంపించారు!

ఈ మధ్య కాలంలో ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు కస్టమర్లకు షాకులమీద షాకులు ఇస్తున్నాయి.

మొబైల్‌ బుక్‌ చేసినవారికి ఇనుప కడ్డీలు, లాప్ టాప్స్ బుక్ చేసిన వారికి రాళ్ళూ రప్పలు పార్సిల్‌ చేస్తున్నాయి.

సరిగ్గా అలాంటి వింత అనుభవమే ఓ కస్టమర్ కి తాజాగా ఎదురైంది.ల్యాప్‌టాప్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వ్యక్తికి రాయితోపాటు కొన్ని ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు డెలివరీ అయ్యాయి.

దాంతో అతగాడు ఖంగుతిన్నాడు.వివరాల్లోకి వెళితే, దీపావళి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి కదాని, కర్ణాటకలోని మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి కోసం అక్టోబరు 15న ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఓ ల్యాప్‌టాప్‌ ఆర్డర్‌ చేశాడు.

అనుకున్న సమయానికి అది డెలివరీ అవడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

తీరా పార్సిల్‌ తెరచి చూస్తే.అందులో రాయి, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉండటం చూసి మొదట వారు మూర్ఛపోయారు.

ఆ తరువాత తేరుకొని కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేసి సమస్యను చెప్పారు.అయినా ఉపయోగం లేకపోయింది.

"""/"/ అయితే వారు దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసారు.

దాంతో అవి వైరల్‌గా మారాయి.ఇకపోతే ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరగడంతో ఈ కామర్స్‌ సంస్థలు ‘ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ’ ఆప్షన్‌ను తీసుకొచ్చాయి.

దానర్ధం, కస్టమర్‌ కోరికమేరకు ఐటమ్‌ డెలివరీ చేసేముందు డెలివరీ చేసే వ్యక్తి పార్సిల్‌ను తెరిచి చూపించాల్సి ఉంటుంది.

తాజా ఘటనలో ఆ వ్యక్తి ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోలేదు.దాంతో ఓపెన్‌ బాక్స్‌ డెలివరీ ఎంచుకోనందున రిఫండ్‌ ఇవ్వడం కుదరదని డెలివరీ సంస్థ తేల్చిచెప్పడంతో.

ఈ కామర్స్‌ సంస్థకు ఫిర్యాదు చేశాడు.ఎట్టకేలకు ఈ కామర్స్‌ సంస్థ జోక్యం చేసుకోవడంతో మొత్తం సొమ్మును రిఫండ్‌ వచ్చింది.