Viral: ఓ పురాతన ఫ్రిడ్జ్ చూసి జనాలకు దిమ్మతిరుగుతోంది… ఎప్పటిదంటే?
TeluguStop.com
పురావస్తు త్రవ్వకాలలో ఓ పురాతన ఫ్రిడ్జ్ బయల్పడింది.పురావస్తు త్రవ్వకాలలో ఫ్రిడ్జ్ బయటపడడం ఏమిటి? అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే.
పురావస్తు శాఖ అధికారులు ప్రతీసారి తవ్వకాలు జరిపినప్పుడు.నిధి నిక్షేపాలు అనేవి బయట పడుతూ వుంటాయని విషయం అందరికీ తెలిసినదే.
తర్వాత వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే.ఎన్నో ఏళ్ల నాటి చరిత్రలు వెలుగు చూస్తాయి.
తాజాగా ఆ కోవకు చెందిన ఓ అరుదైన ఘటన దక్షిణ ఇరాక్‌లో చోటు చేసుకుంది.
"""/"/
తాజాగా దక్షిణ ఇరాక్‌లోని తవ్వకాలు జరిపిన పురావస్తు అధికారులకు దిమ్మతిరిగే అనుభవం ఎదురైంది.
దాదాపు 5 వేల ఏళ్ల నాటి రెస్టారెంట్ అవశేషాలు అక్కడ బయటపడటం విశేషం.
సుమేరియన్ నాగరికతకు ముఖ్యమైన కేంద్రంగా పిలిచే పురాతన లగాష్ శిధిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేపట్టగా అక్కడ వారు ఈ పురాతన రెస్టారెంట్‌ను కనుగొన్నారు.
అందులో ఆ కాలం నాటి ఓవెన్, కొన్ని బెంచీలు, గిన్నెలు, ఇతర పాత్రలతో పాటు ‘జీర్’ అని పిలిచే మట్టి రిఫ్రిజిరేటర్ కూడా బయటపడింది.
"""/"/
అందులో ఏముందా? అని అధికారులు చూడగా వారికి గమ్మత్తైన విషయాలు తెలిసాయి.
ఆ ఫ్రిజ్‌లో బీర్‌ను దాచినట్టు వారికి రుజువులు దొరికాయి.అంతే కాకుండా ఆ పురాతన బీర్ తయారు చేసే ఒక రెసిపీని కూడా పురావస్తు అధికారులు అక్కడ కనుగొన్నట్లు చెప్పారు.
ఇక ఈ తవ్వకాల్లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, పిసా విశ్వవిద్యాలయాలకు చెందిన బృందాల పాల్గొన్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎందుకంటే ఆ కాలంలో కూడా ఫ్రిడ్జ్ వాడకంలో వుంది అంటే చాలామంది అవాక్కవుతున్నారు.
కొంతమంది ఈ విషయాన్ని నమ్మితే, మరికొంతమంది ఇదంతా వట్టి పుకారే అని కొట్టి పారేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ వేడుకకు వస్తే సినిమా ఫ్లాపేనా… ఇదేం లాజిక్?