వైరల్: ఈ ఉపాధ్యాయుడికి నిజంగా సలాం చేయాల్సిందే..!

కరోనా వైరస్ విజృంభణ తరువాత ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు.

ఇప్పటికే ఏడాదికిపైగా విద్యార్థుల విలువైన సమయం వృధా అయ్యింది.గతేడాదితో కరోనా తగ్గుముఖం పట్టిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలోనే సెకండ్ వేవ్ లో కరోనా విజృంభిస్తోంది.

గత ఏడాది కంటే ఈ ఏడాది కరోనా వైరస్ విద్యార్థుల పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

దీంతో తప్పని పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలను మూసివేస్తున్నాయి.దీంతో విద్యార్థులకు విద్య అందక తీవ్ర నిరాశ చెందుతున్నారు.

అయితే కొంతమంది ఉపాధ్యాయులు.విద్యార్థులు ఎట్టి పరిస్థితులలోనూ సమయం వృధా చేసుకోకూడదని భావించి స్వతంత్రంగా చొరవ తీసుకొని పాఠాలు బోధిస్తున్నారు.

మధ్యతరగతి, ధనిక విద్యార్థులు ఆన్లైన్ లో పాఠాలు వింటున్నా.పేద విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది.

దీంతో పేద విద్యార్థులకు కూడా పాఠాలు చెప్పాలి అని చాలామంది ఉపాధ్యాయులు కరోనా కాలంలో కూడా బయటకు వచ్చి తమ వంతు కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

"""/"/ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యేంద్ర పాల్ అనే ఒక ఉపాధ్యాయుడు కూడా పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.

గణితంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన ఈ ఉపాధ్యాయుడు ఢిల్లీలోని ఒక ఫ్లైఓవర్ కింద మురికివాడల్లో నివసించే పేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు.

ఈ మాస్టారు తూర్పు ఢిల్లీలో నిరుపయోగంగా ఉన్న ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కింద పాఠాలు చెబుతున్నారు.

అయితే ఆయన పాఠాలు చెబుతున్న దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీస్ సుశాంత నంద ఈ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.మురికివాడల్లో నివసించే పేద పిల్లలకు కూడా చదువు అందాలన్న ఉద్దేశంతో ఈ టీచర్ చేస్తున్న కృషికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

"""/"/ వైరల్ అయిన ఫోటోలో ఫ్లైఓవర్ నిర్మాణ గోడలపై ఏబిసిడిలు రాసి ఉండగా.

గణిత మాస్టారు ప్రత్యేకంగా తెచ్చుకున్న ఒక వైట్ బోర్డు కనిపించింది.ఈ ఫోటోలో గొప్ప విషయం ఏంటంటే.

పిల్లలు మాస్టారు చెబుతున్న పాఠాలు శ్రద్ధగా వింటున్నారు.నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా.

అందరూ చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందడంతో పాటు నేరాలు ఘోరాలు తగ్గుతాయి.విద్య నేర్చుకోకపోతే క్రమశిక్షణ లేక పిల్లలు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది.

అందుకే టీచర్లు ఎట్టి పరిస్థితులలోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిందే.వారిని మంచి దారిలో నడిపించేవలసిందే.

"""/"/ అయితే ఒక సాధారణ గ్రామానికి చెందిన సత్యేంద్ర పాల్ 2015 వ సంవత్సరం నుంచి మురికివాడల్లో నివశిస్తున్న విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.

గత ఏడాది కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఆయన విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠాలు చెప్పడం మానేశారు.

కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన కోరడంతో వెంటనే ఆయన తగిన జాగ్రత్తలు పాటిస్తూ పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

అయితే తాను ఏదో ఒక పాఠశాలలో బోధిస్తూ డబ్బులు సంపాదించవచ్చని కానీ అలా చేస్తే తను ఒక్కడినే సంపాదించగలనని.

అందుకే అలా కాకుండా ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన వంతు కొందరు పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నానని ఆయన అన్నారు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్…కారణం ఏంటంటే..?