వైర‌ల్‌.. స్కూల్ స్టూడెంట్ల అకౌంట్లో ప‌డ్డ రూ.900 కోట్లు..

కొన్ని సార్లు అంతే.అనుకున్న‌వి జ‌ర‌గ‌వు గానీ ఊహించ‌న‌వి మాత్రం జ‌రుగుతాయి.

ఇక ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌తి ఒక్క‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి.ఇప్పుడు ఏమైందంటే బ్యాంక్ అధికారులు చేసి మిస్టేక్ వ‌ల్ల పెద్ద పొర‌పాటు జ‌రిగిపోయింది.

సాధార‌ణంగా ఎవ‌రికైనా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌నుకుంటే ఒక‌రోజులో అయిపోతుంది.ఒక‌వేళ బ్యాంకు అధికారులు క‌రెక్టుగా ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌కుండా ఇత‌రుల‌కు చేస్తే.

ఆ ఇత‌రులు దాన్ని వాడేసుకుంటే ఎలా ఉంటుంది.పెద్ద స‌మ‌స్య వ‌చ్చి ప‌డుతుంది క‌దా.

ఇక ఇప్పుడు అయితే ఏకంగా విద్యార్థుల అకౌంట్లోకి రూ.900 కోట్లు వ‌చ్చిప‌డ్డాయి.

బ్యాంకు అధికారులు పొర‌పాటు వ‌ల్ల ఇలా జ‌రిగింది.అయితే అసలు విషయం తెలిసి స్టూడెంట్లు షాక్ అయిపోయారు.

ఈ ఘటన కొంచెం ఆల‌స్యంగానే ఉత్తర బీహార్ ప్రాంతంలోని ఓ ఊరిలో చోటుచేసుకుంది.

ఈ గ్రామంలోని ఇద్దరు స్కూల్ పిల్లల బ్యాంకు అకౌంట్ల‌లో ఈ సొమ్ము జ‌మ అయింది.

ఇద్ద‌రు స్టూడెంట్లు అయిన గురుచంద్ర విశ్వాస్, అసిత్ కుమార్ ల అకౌంట్ల‌లో ఈ డ‌బ్బులు ప‌డ్డాయి.

అయితే వీరిద్ద‌రూ కూడా స్థానిక స్కూల్‌లో చదువుతున్నారు.ఇక్క‌డి ప్ర‌భుత్వం స్కూల్ యూనిఫామ్ కోసం వేస్తున్న డ‌బ్బుల గురించి తెలుసుకునేందుకు వారు స్థానిక సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ కు వెళ్లారు.

"""/"/ అయితే అక్క‌డి వారు చెక్ చేసి అకౌంట్లో రూ.900 కోట్లు ఉన్న‌ట్టు చూసి షాక్ అయిపోయారు.

ఇందులో విశ్వాస్ అనే స్టూడెంట్ అకౌంట్లో రూ.60 కోట్లు, అలాగే అసిత్ అకౌంట్లో రూ.

900 కోట్లు ఉండ‌టం చూసి అంద‌రూ నోరెళ్ల‌బెట్టారు.కాగా ఆ స్టూడెంట్లు ఆ డ‌బ్బుల‌ను విత్ డ్రా చేసుకోరాకుండా వారి ఇద‌రువురి అకౌంట్ ల‌ను అధికారులు ఫ్రీజ్ చేసేశారు.

ఇక ఇంత డ‌బ్బు వారి అకౌంట్లలోకి ఎలా వ‌చ్చిందో తెలుసుకునేందుకు విచారణ జ‌రిపిస్తున్నారు.

రంగంలోకి దిగిన బ్యాంక్ సీనియర్ ఆఫీస‌ర్లు అస‌లు విష‌యాన్ని తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?