కపులింగ్ ఓపెన్ చేస్తుండగా ట్రైన్‌ రివర్స్.. నుజ్జునుజ్జు అయిన రైల్వే వర్కర్..

బిహార్ రాష్ట్రం,( Bihar ) బెగుసరాయ్ జిల్లాలోని బరౌని జంక్షన్ రైల్వే స్టేషన్‌లో( Barauni Junction Railway Station ) శనివారం ఓ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

సోన్‌పూర్ రైల్వే విభాగంలో పోర్టర్‌గా పనిచేస్తున్న అమర్ కుమార్ రావు( Amar Kumar Rao ) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించారు.

లక్నో నుంచి బరౌనికి వచ్చిన లక్నో-బరౌని ఎక్స్‌ప్రెస్ (15204) రైలును 5వ ప్లాట్‌ఫాం వద్ద ఆపినప్పుడు, దానిని కపులింగ్ చేసే పనిలో పడ్డాడు అమర్.

ఆ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.రైలును కపులింగ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా, అకస్మాత్తుగా రైలు వెనక్కి జరిగింది.

ఈ క్రమంలో రైలు బోగీల మధ్య చిక్కుకున్న ఆయన క్షణాల్లో మృతి చెందారు.

"""/" / రైల్వే కార్మికుడు అమర్ కుమార్ రావు మరణించిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ, రైలు డ్రైవర్( Loco Pilot ) ప్రమాదాన్ని ఆపకుండా పారిపోయినట్లు తెలుస్తోంది.

రైలు వెనక్కి వెళ్లకుండా ఆపలేదు.ఆ లోకం పైలెట్ కనీసం స్టాప్ కూడా చేయలేదు.

అలా అదుపు తప్పిన ఇంజిన్ రావును ఢీకొని చిదిమేసింది.అందులో ఇరుక్కుపోయి చనిపోయిన ఫోటోలను సెల్‌ఫోన్‌లలో అప్చర్ చేశారు అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/" / రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.లోకో పైలట్ ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ప్రవర్తించాడు? అనే కోణంలో విచారించవచ్చు.

ఒకవేళ ఈ సంఘటనలో అతనిదే మొత్తం తప్పు అయి ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవచ్చు.

ఇదిలా ఇలా ఉండగా కేరళలోని పాలక్కాడు జిల్లాలోని షోర్నూర్ సమీపంలో నవంబర్ 2న నాలుగురు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని మరణించారు.

ట్రైన్ల కారణంగా చాలామంది ప్రజలు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.

షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?