వైరల్: గుళ్లో పూజారి శంఖం ఊదితే ఎలుగుబంట్లు పరుగెత్తుకుని రావడం ఏంటబ్బా..?

దేవ దేవతలను దర్శించుకుని మన కష్టాలను తగ్గించి సుఖ శాంతులను ప్రసాదించాలని కోరుకోవడానికి మనలో చాలా మంది గుడికి వెళ్తూ ఉంటారు.

అయితే కేవలం మానవులే కాకుండా జంతువులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి గుడికి వస్తాయనే విషయం మీలో చాలామందికి తెలియదు.

పాములు, కోతులు, కుక్కలు ఒక్కోసారి గుడికి వచ్చి దేవుడిని దర్శించుకుని పూజారులు, భక్తులు పెట్టే తీర్ధ ప్రసాదాలను సేవించి వారికి ఎటువంటి హాని తలపెట్టకుండా తిరిగి వెళ్లిపోవడం గురించి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఒక దేవాలయంలో ప్రతిరోజు పూజారి శంఖం పూరించిన పిదప అక్కడ అడవిలో ఉన్నా క్రూర మృగాలు అయిన ఎలుగుబంట్లు అక్కడి గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని గుడిలో ఉన్న భక్తులను ఏమి చేయకుండా వెళ్ళిపోతాయట.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం.ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో చూడడానికి అనేక వింతలు, అద్భుతాలు, అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.

వాటిలో ఇది కూడా ఒక వింత అనే చెప్పాలి.ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మహా సముందు జిల్లాలో గల బాగబాహార అనే గ్రామం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో గల అటవీ ప్రాంతంలో ఉన్న గుట్టపైన ప్రసిద్దిగాంచిన “చండీ దేవి” ఆలయం ఒకటి ఉంది.

ఈ ఆలయం ప్రతి రోజు కూడా భక్తులతో కిటకిట లాడుతూ ఉంటుంది.అయితే ఈ గుడి అడవికి దగ్గరలో ఉండడంతో ఆ అడవిలో అనేక రకాల క్రూర మృగాలతో పాటు ఎలుగుబంట్లు కూడా జీవిస్తూ ఉంటాయి.

ఈ క్రమంలోనే అడవి ప్రాంతంలో గల చండీ దేవి ఆలయానికి సుమారు ఇరవై సంవత్సరాల నుండి ప్రతీరోజు ఎలుగుబంట్లు ఆ గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ గల పూజారి, భక్తులు పెట్టే ప్రసాదాలను తిని వెళ్తున్నాయి.

"""/" / ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలుగుబంట్లు గుడి ప్రాంగణంలో ఉన్నంత సేపు అక్కడ ఉన్న భక్తులకు ఏ చిన్న హాని కూడా తలపెట్టవంట.

ఇన్ని సంవత్సరాలలో అసలు ఇలాంటి ఘటన కూడా జరగలేదు అని అక్కడి ప్రజల చెప్తున్నారు.

అయితే గుడి దాటి అడవిలోకి వెళ్లిన వెంటనే క్రూరంగా మారిపోతాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు.

ఇలా నిత్యం గుడిలో పూజా కార్యక్రమాలు అయ్యి హారతి పూర్తి కాగానే, గుడిలో పూజారి శంఖం ఊదుతాడు.

అలా శంఖం ఊదిన కొద్దిసేపటికే ఎలుగుబంట్లు అడవిలో ఎక్కడ ఉన్నాగాని గుడిలో ఉన్న అమ్మవారి గర్భాలయంలోకి వస్తాయి.

పూజారి పెట్టిన ప్రసాదం తిని అనంతరం తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాయట.కాగా అక్కడి ప్రజలందరూ ఈ అమ్మవారిని ఎంతో పవిత్రమైన మహిమ గల దేవతగా కొలుస్తుంటారు.

హెచ్ 1 బీ వీసా ప్రక్రియలో మోసాలు.. కలకలం రేపుతోన్న బ్లూమ్‌బెర్గ్ నివేదిక