వైరల్: మనుషులకు మల్లే బ్యాక్ ఫ్లిప్ కొడుతున్న పావురం.. హేట్సాఫ్ కొట్టాల్సిందే!
TeluguStop.com
ఈమధ్య కాలంలో బ్యాక్ ఫ్లిప్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
సామాన్యులనుండి సెలిబ్రిటీల వరకు పోటీపడుతూ తాము బ్యాక్ ఫ్లిప్ వేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆనందం పొందుతున్నారు.
ఈ క్రమంలో వాటిని చూసేవారి సంఖ్య మిలియన్ల సంఖ్యలో ఉంటోంది.అందులో కొన్ని వీడియోలు ఫన్నీగా అనిపిస్తే.
మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న వీడియో మాత్రం అందరిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది.
విషయం ఏమిటంటే, ఓ అందమైన పావురం మీరు మాత్రమే కాదు, నేను కూడా సూపర్ గా బ్యాక్ ఫ్లిప్ వేయగలను అంటూ ఛాలెంజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చి షేక్ చేసింది.
సోషల్ మీడియాలో ఈ వీడియో చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.సదరు వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే.
ఓ పావురం సునాయాసంగా తన రెక్కలను గాల్లోకి ఆడిస్తూ.తలకిందులుగా యెగిరి మరలా యథాస్థానానికి రావడం మనం గమనించవచ్చు.
ఈ వీడియో చూసిన తర్వాత ఇది మామ్మూలు పావురం కాదు.టంబ్లర్ పావురం అని కామెంట్ చేసాడు.
అయితే పావురాలు ఐడియా వున్నవారు ఒక టంబ్లర్ పావురం ఎగురుతున్నప్పుడు ఇలా సహజంగానే గింగిరాలు కొడుతుందని కామెంట్ చేసాడు.
ఈ జాతికి చెందిన కొన్ని పావురాలు తమ వద్ద ఉన్నాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే ఈ వీడియో ఎక్కడ తీశారు.ఎప్పుడు తీశారో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.
ఈ 11 సెకన్ల వీడియోను ఇప్పటి వరకు 9.3 మిలియన్ల వీక్షణలు పొంది రికార్డు సృష్టించింది.
వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు.పల్టీలు కొట్టడానికి చాలా కష్టపడాలని, కానీ ఈ పావురం మాత్రం సులభంగా చేసేస్తోందని తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
10 నిమిషాల్లో మీ ఫేస్ సూపర్ బ్రైట్ గా మారాలంటే ఈ రెమెడీస్ ట్రై చేయండి!