వైర‌ల్ పిక్‌.. ఈ బండ‌రాళ్ల మ‌ధ్య ప‌డుకున్న చిరుత ఎక్క‌డుంద‌బ్బా..?

కొన్ని ట్విస్టు ఇచ్చే ప్ర‌శ్న‌లు మ‌న మెద‌డుకు పెద్ద ప్ర‌శ్న‌లే వేస్తుంటాయి.చూడ‌టానికి చిన్న టాస్క్ లాగే అనిపించినా దాన్ని క‌నిపెట్టేందుకు నానా అస‌వ్థ‌లు ప‌డాల్సి వ‌స్తుంది.

అయితే మ‌న‌కు సోష‌ల్ మీడియా అనేది అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ త‌ర‌హా ఫైండ్ ది ఆబ్జెక్ట్ పజిల్స్ అనేవి విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.

ఇక ఇలాంటి వారిని సోషల్ మీడియాలో బోర్ కొట్టకుండా చాలా మంది సాల్వ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తూనే మంచి టైం పాస్ చేస్తుంటారు.

బోర్ కొట్టిన‌న‌ప్పుడ‌ల్లా ఇలాంటి ప‌జిల్స్‌ను ఆడితే మ‌న‌సుకు కూడా కొంచెం స‌ర‌దాగా అనిపిస్తుంది.

ఇక ఇలాంటి ప‌జిల్స్ మ‌న‌కు ఎక్కువ‌గా అడ‌వి జంతువుల విష‌యంలో బాగా కనిపిస్తుంటాయి.

ఏదో ఒక ఫొటో ఇచ్చి అందులోని అడ‌వి జంతువును క‌నిపెట్ట‌మంటూ చెప్ప‌డ‌మే ఈ త‌ర‌హా ప‌జిల్స్ అని చెప్పాలి.

ఇక ఇప్పుడు క‌రోనా కార‌ణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారిలో చాలామంది ఇలాంటి ప‌జిల్స్ పై దృష్టి సారించడంతో తరచూ ఏదొకటి నెట్టింట విప‌రీతంగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు కూడా అలాంటి పిక్చర్ పజిల్స్ గురించే మ‌నం మాట్లాడుకుందాం.ప్ర‌స్తుతం ఓ చిరుతపులికి సంబంధించిన ఫొటో ఇది.

"""/"/ ఈ ఫొటోలో ఉన్న కొండ ప్రాంతంలో అన్ని న‌ల్ల‌ని బండ‌లాల్లు క‌నిపిస్తుంటాయి.

కాగా ఈ బండ‌రాళ్ల న‌డుమ ఓ చిరుతపులి హాయిగా సేద తీరుతోంది.ఇక్క‌డ ట్విస్టు ఏంటంటే ఆ రాళ్ల రంగు, చిరుత రంగు రెండూ ఒకేలా ఉండ‌టంతో అస‌లు చిరుత పులి ఎక్కడ ఉందో కనిపెట్టడానికి చాలామంది ఫెయిల్ అవుతున్నారు.

ఎంతో తీక్షణంగా చూస్తే గానీ ఆ చిరుత పులిని క‌నిపెట్ట‌లేమ‌నే చెప్పాలి.ఇక చాలా మంది ఈ పజిల్‌ను ఒక ప్ర‌య‌త్నంలోనే సాల్వ్ చేస్తున్నా కూడా కొంద‌రు మాత్రం ఎన్నో సార్లు ప్ర‌య‌త్నించినా కానీ స‌క్సెస్ కాలేక‌పోతున్నారు.

బన్నీని సాయితేజ్ అన్ ఫాలో కావడంపై నిహారిక రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?