వైరల్ ఫోటో: వావ్.. చంద్రుడిపై సూర్యోదయం అదిరిపోయిందిగా

విశ్వాంతరంలో ఏదో ఒక కొత్త విశేషం, వింత ఘటన నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటుంది.

ఖగోళ శాస్త్రం (Astronomy) ప్రపంచాన్ని అబ్బురపరిచే కొత్త విషయాలను తరచూ బయట పెడుతోంది.

నక్షత్రాలు, గ్రహాలు, చందమామ వంటి ఖగోళ వింతలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి.అంతరిక్ష ప్రయోగాలు, కొత్త గ్రహాల కదలికలు, నక్షత్రాల నిర్మాణం, నెబ్యులాల అందాలు, సూర్యోదయం, చంద్రోదయం వంటి దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

తాజాగా, చంద్రునిపై కనిపించిన సూర్యోదయం (Sunrise On The Moon) అబ్బురపరిచింది.ఈ అద్భుత దృశ్యాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) ప్రపంచానికి పరిచయం చేసింది.

భారత దేశంలో కన్యాకుమారిలో (Kanyakumari) ఉదయం సూర్యోదయాన్ని చూడడంలో ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది.

ఈ సూర్యోదయాన్ని చూడటానికి ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.కానీ, నాసా తాజాగా విడుదల చేసిన ఫోటోలోని సూర్యోదయాన్ని చూడాలంటే మాత్రం చంద్రునిపై (Moon) నుంచే చూడాలి.

ఎందుకంటే, అది ఎక్కడా కాదు.చంద్రుని ఉపరితలంపై తీసిన సూర్యోదయ చిత్రం.

మార్చి 2న ఫైర్‌ప్లై ఏరోస్పేస్‌ (Firefly Aerospace) సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్‌ (Blue Ghost) అనే ప్రైవేట్‌ ల్యాండర్‌ విజయవంతంగా చంద్రునిపై దిగింది.

ఈ ప్రయోగంతో చరిత్ర సృష్టించిన ఈ ల్యాండర్‌ తన కెమెరాతో చంద్రునిపై అద్భుతమైన సూర్యోదయాన్ని బంధించింది.

ఫైర్‌ఫ్లై సంస్థ ఎక్స్‌ (Twitter) లో ఈ అద్భుత ఫోటోను పంచుకుంది. """/" / చంద్రుని ఉపరితలం (Lunar Surface) లోతైన లోయలు, ఎత్తైన పర్వతాలపై సూర్యకిరణాలు ప్రకాశవంతంగా కనిపించడం ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.

"ఇది కొత్త తెల్లవారుజాము, ఇది కొత్త రోజు, మేము మంచి అనుభూతి చెందుతున్నాము" అని ఫైర్‌ఫ్లై స్పేస్‌ సంస్థ ప్రకటించింది.

ఫైర్‌ఫ్లై ల్యాండర్‌ చంద్రుని ఈశాన్య భాగంలో ఉన్న మారే క్రిసియమ్‌ (Mare Crisium) వద్ద మోన్స్ లాట్రెయిల్‌ (Mons Latreille) సమీపంలో దిగింది.

ఈ యాత్రలో మొత్తం పది రకాల ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఫైర్‌ఫ్లై సంస్థ తెలిపింది.

అంతేకాకుండా, చంద్రునిపై ఉపరితల పనులను కూడా ప్రారంభించారు.వచ్చే రెండు వారాల పాటు, ఆ తర్వాత చంద్రరాత్రిలో కూడా పని చేయనున్నట్లు వెల్లడించారు.

"""/" / చంద్రుని ఉపరితలం నుంచి సూర్యోదయం తీర్చిదిద్దిన ఈ చిత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అంతరిక్షంలో అంతగా చూడలేని ఈ రకమైన దృశ్యం ఖగోళ శాస్త్రవేత్తలను, అంతరిక్ష ప్రియులను అబ్బురపరుస్తోంది.

ఈ విధమైన ఖగోళ విశేషాలు మానవ జిజ్ఞాసను రేపడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష ప్రయాణాలకు మరింత ప్రేరణగా నిలుస్తాయి.

చంద్రుడిపై సూర్యోదయం చూడడం వంటి విశేష దృశ్యాలు మానవులు కొత్త దిశగా ప్రయాణిస్తున్నారనే సంకేతాలను ఇస్తున్నాయి.