ఈ పిల్లాడు సూపరు.. 40 నిమిషాల ‘జూమ్ క్లాస్‌’కే నిద్రపోయాడు!

సాధారణంగా పిల్లలకు స్కూల్ కి వెళ్లి అక్కడ పాఠాలు వినడమే కష్టము.అలాంటిది కరోనా పుణ్యమా అని సెలవలు వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ టెక్నాలజీ కారణంగా ఇంట్లోనే కూర్చొని పాఠాలు వినాల్సి వస్తుంది.

అలా జుమ్ కాల్ లో పాఠాలు వినే ఎంతోమంది పిల్లలు స్కూల్ త్వరగా తెరిస్తే మేలు ఈ స్కూల్ కష్టాలు ఎలాగో తప్పడం లేదు అన్నట్టు ఉన్నారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ బుడ్డోడు జూమ్‌లో నిర్వ‌హించిన క్లాసుకు హాజరయ్యాడు.అయితే క్లాసు ప్రారంభమైన 40 నిమిషాలకే ఆ బుడ్డోడు నిద్రలోకి జారుకున్నాడు.

కుర్చీనే పరుపులా భావించి ఓ రేంజ్ లో నిద్రపోయాడు.అటువైపు టీచర్ పాఠాలు కాస్త ఆ బుడ్డోడికి లాలీ పాట అయ్యింది అంటే నమ్మండి.

ఇంకా అలా నిద్రపోతున్న బుడ్డోడి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోను చుసిన నెటిజన్లు అంత నీ పని బాగుంది రా బుడ్డోడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు అయితే ఏ 2020 అంత ఇలాగే గడిచిపోయేలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా 2020 సంవత్సరం ప్రజల జీవితాలను మార్చేసింది.మళ్లీ రొటీన్ జీవితంలోకి వెళ్ళాలి అంటే సమయం పడుతుంది.

ఏనుగుకు గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. ఇదెలా డ్యాన్స్ చేసిందో చూస్తే ఫిదా..??