మహిళపై కోపంతో రెచ్చిపోయిన మతబోధకుడు.. వీడియో వైరల్
TeluguStop.com
పంజాబ్‌లోని జలంధర్‌లో( Jalandhar ) ఓ మతబోధకుడిపై( Religious Leader ) లైంగిక ఆరోపణలు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఆఫీసులో ఉన్న వారిపై తీవ్రంగా కోపగించుకుని, వస్తువులు విసిరేస్తూ గొడవ చేస్తున్నట్లు మతబోధకుడు కనిపించాడు.
అంతేకాకుండా అక్కడే ఉన్న ఓ యువకుడితో పాటు మహిళలపై( Women ) కూడా దాడి చేయడం కూడా చూడొచ్చు.
ఈ ఘటనతో అతడిపై ఆరోపణలు ఎదురయ్యాయి.జలంధర్‌కు చెందిన ఓ యువతి (22) ఈ మతబోధకుడిపై ఫిబ్రవరిలో కపుర్తలా పోలీసులకు( Kapurthala Police ) ఇచ్చిన ఫిర్యాదులో.
తల్లిదండ్రులతో కలిసి 2017 నుంచి 2023 వరకు అతడి ప్రార్థనా కేంద్రాలకు వెళ్లేదాన్నని, అయితే ఒకసారి తన మొబైల్ నంబర్ తీసుకుని అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.
ఆదివారాల్లో తన క్యాబిన్‌కు పిలిచి ఒంటరిగా కూర్చోబెట్టేవాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపించింది.ఇదే కాకుండా, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పితే తన తల్లిదండ్రులకు హాని కలిగిస్తానంటూ బెదిరించాడని కూడా ఆమె చెప్పింది.
"""/" /
ఈ ఆరోపణలపై జలంధర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు విచారణను ప్రారంభించారు.
ఈ విషయంలో పంజాబ్ మహిళా కమిషన్( Punjab Women's Commission ) జోక్యం చేసుకుని, బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని సూచించింది.
అలాగే, పంజాబ్ పోలీసులు ఈ వ్యవహారంపై వేగంగా చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది.
"""/" /
తాజాగా బయటకు వచ్చిన వీడియోలో మతబోధకుడు సింగ్ తన ఆఫీసులో పనిచేస్తున్న వారిపై తీవ్ర కోపంతో మొబైల్, ఫైళ్లు విసిరేయడం, వారితో దురుసుగా ప్రవర్తించడం స్పష్టంగా కనిపించింది.
అలాగే, ఓ యువకుడిని తోసి, మహిళలపై చేయి చేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వీడియోతో అతడిపై ఉన్న ఆరోపణలు మరింత బలంగా మారాయని నెటిజన్లు అంటున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం జలంధర్ పోలీసులు హ్యాండిల్ చేస్తున్నారు.సింగ్‌పై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నందున, ఈ కేసులో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి.
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
హాస్టల్ పైనుంచి ఈ అమ్మాయి ఇలా దూకేసింది ఏంటీ.. తర్వాత ఏమైందో చూడండి…