వైరల్: ఓరి దేవుడా.. ఈసారి చికెన్ బిర్యానీలో ఏకంగా..?
TeluguStop.com
సాధారణంగా చాలామందికి బిర్యానీ( Biryani ) అంటే చాలా ఇష్టం.ముఖ్యంగా హైదరాబాద్ లో చేసిన బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎందరో.
బిర్యానీ లవర్స్ అయితే ఏకంగా ప్రతిరోజు బిరియాని తిన్న కూడా వారికి సాటిస్ఫాక్షన్ ఉండదని చెప్పాలి.
వాస్తవానికి బిర్యానీ అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది హైదరాబాద్.గత కొద్ది రోజులుగా కుళ్లిపోయిన మాంసాలతో, పురుగు పట్టిన మాంసంతో బిర్యానీని వండి హైదరాబాద్ లోని పలు హోటల్ లలో సేల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
అయితే తాజాగా బిర్యానీ తో పాటు ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్( Plastic Cover ) పార్సల్లో వచ్చింది.
"""/" /
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.హైదరాబాదు లోని మణికొండ ( Manikonda )కు చెందిన ఒక జెలని( Jelani ) అనే వ్యక్తి స్విగ్గిలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా.
మసాలా దండించిన చికెన్ పీసుతో పాటు బాగా ఉడికిన, ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కస్టమర్ పొందాడు.
ఇక ఈ ప్లాస్టిక్ కవర్ ను చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.
ఇక వాస్తవానికి ఈ బిర్యానీను మణికొండ ప్రాంతంలోని మెహిఫిల్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసినట్లు బాధితుడు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.
"""/" /
ఇందుకు సంబంధించి జెలని ట్విట్టర్ వేదికగా మరో పోస్టులు చేస్తూ స్విగ్గి ఇప్పుడే తన టికెట్ ని మూసివేసిందని.
నేను తిన్నానో లేదా.నేను బాగున్నానా లేనా.
అని వారు తెలుసుకోవచ్చా అవసరమే లేదంటూ వాపోయాడు.అయితే ఇందుకు స్విగ్గి కస్టమర్ కేర్ రిప్లై ఇస్తూ.
హాయ్ జెలని.ఇలా జరగడం మాకు కూడా ఇష్టం లేదని దయచేసి మీ ఆర్డర్ నెంబర్ మాకు తెలపండి.
దానికి సంబంధించి మేము చర్యలు తీసుకుంటామంటూ స్పందించింది.ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తూ.
బయట ఆహారం తినవద్దని చాలామంది ప్రజలు కామెంట్ చేస్తుండగా., మరికొందరేమో.
ముందు ముందు ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో అంటూ కామెంట్ చేస్తున్నారు.
పుష్పరాజ్ లాంటి వ్యక్తులు బయట కూడా ఉన్నారు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!