నేల విడిచి సాము : అచ్చెన్న మాటలు కోటలు దాటాయా ?

ఇంకా తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినా, దానిని చంద్రబాబు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ అంగీకరించినట్టుగా కనిపించడంలేదు.

ప్రజలు తమను ఓడించి వారే పూర్తిగా నష్టపోయారని, జగన్ పరిపాలనలో ఎవరికి ఎటువంటి ప్రయోజనం కలవలేదని, మళ్ళీ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే విధంగా టిడిపి నాయకులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.

అసలు జగన్ కు పరిపాలించే హక్కు లేదని, ప్రభుత్వం కూలిపోతుందని , మళ్లీ తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు.

2019 ఎన్నికల్లో టిడిపి కి 23, వైసీపీ కి 151 సీట్లు దక్కాయి.

గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలు నలుగురు వైసీపీకి ఇప్పుడు జై కొట్టారు.తాజాగా టెక్కలి ఎమ్మెల్యే, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు మాట్లాడిన మాటలు పెద్ద సంచలనంగా మారాయి.

రాబోయే ఎన్నికల్లో టిడిపికి 155 సీట్లు వస్తాయని జోస్యం అచ్చెన్న చెబుతున్నారు.అంతేకాదు దీనికి కొన్ని ఉదాహరణలను అచ్చెన్న చూపిస్తున్నారు.

ఏపీలో ఇటీవల సర్వేలు నిర్వహించామని, ఆ సర్వేల రిపోర్టు లో వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత కనిపించిందని, మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధికారం వస్తుందని ధీమాగా అచ్చెన్న చెబుతున్నారు.

అంతేకాదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ నేతలను పలకరించేవారు ఉండరని, అచ్చెన్న చెబుతున్నారు.

అయితే ఆయన చెబుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీకి 155 సీట్లు రావడం  అంత ఆషామాషీ వ్యవహారం కాదని, అసలు 2019 ఓటమి తర్వాత నుంచి టిడిపి తన గ్రాఫ్ పెంచుకునేందుకు ఏం ప్రయత్నం చేసిందనే విషయం కూడా చర్చనీయాంశం అవుతోంది.

పెద్దగా ప్రజా పోరాటాలు చేయడం, రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం లో  విఫలమైందనే చెప్పుకోవాలి.

అమరావతి వ్యవహారంలో తప్ప, మిగతా విషయాల్లో పెద్దగా పోరాడేందుకు ఆసక్తి చూపించకపోవడం, ఎప్పుడూ కోర్టుల్లో వివిధ పథకాలపై పిల్స్ వేయడం, కేసులు వేయడం తప్పించి జనాలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి చేసుకోకపోవడం, ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా, అదే పనిగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉండడం తో టిడిపిపై జనాల్లో గ్రాఫ్ పెరగకపోగా, కాస్త ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతున్నాయి.

"""/"/ ప్రస్తుత పరిస్థితిని పట్టించుకోకుండా అచ్చెన్న 155 సీట్లు అంటూ గొప్పగా చెప్పుకోవడం, నేల విడిచి సాము అన్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది.

అంతేకాకుండా అప్పుడే అధికారంలోకి వచ్చినట్లుగా వైసిపి నాయకులకు వార్నింగ్ ఇస్తూ ఉండడం కూడా చర్చనీయాంశం అవుతోంది.

అచ్చెన్న వంటి నాయకులు ధీమాగానే ఇటువంటి ప్రసంగాలు చేస్తున్నా, టిడిపి నాయకులు మాత్రం క్షేత్రస్థాయిలోకి వచ్చి పోరాటం చేసేందుకు మాత్రం ముందుకు రాకపోవడమే కొసమెరుపు.

అమెరికా వీధుల్లో అనుకోకుండా యూట్యూబర్ కి దొరికిన గౌతమ్.. అసలేం జరిగిందంటే?