వైరల్: ఏ డిగ్రీ లేదు, కానీ ఏడాదికి రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు?
TeluguStop.com
సాధారణంగా అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో పెద్ద డిగ్రీలు చేస్తేనే నెలకి కోటి సంపాదించడం గగనం.
అలాంటిది ఒక వ్యక్తి ఎలాంటి యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేయకుండానే నెలకు రూ.
2 కోట్లకు పైగా డబ్బులు సంపాదిస్తున్నాడు.ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, ఏం చేస్తున్నాడు అనే కదా మీ సందేహం.
అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే.వివరాల్లోకి వెళితే.
యూకేలోని కెన్సింగ్టన్‌లో స్టీఫెన్ ఫ్రై ( Stephen Fry In Kensington, UK )అనే వ్యక్తి ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు.
అతను ఏడాదికి £210,000 డబ్బు సంపాదిస్తున్నాడు.అంటే భారతీయ కరెన్సీలో రూ.
2 కోట్ల 15 లక్షలు.ఈ ప్లంబర్ బాయిలర్లు, టాయిలెట్లు, దుస్తులను ఉతికే యంత్రాలు వంటి వాటిని బాగు చేస్తాడు.
ఇతను లండన్‌లోని ఒక ఫాన్సీ ప్రాంతంలో నివసిస్తున్నాడు.వచ్చిన డబ్బులతో స్టీఫెన్ సెలబ్రిటీల వలె మాల్దీవులు, కానరీ దీవులు వంటి ప్రదేశాలకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తాడు.
"""/" /
స్టీఫెన్‌కు 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతనికి ఉద్యోగం లేదు.
కానీ అతను స్థానిక జాబ్ సెంటర్ సలహా విని ప్లంబింగ్ అప్రెంటిస్ అయ్యాడు.
పదేళ్ల క్రితం పిమ్లికో ప్లంబర్స్( Pimlico Plumbers ) అనే కంపెనీలో చేరాడు.
ఇప్పుడు అతను చాలా డబ్బు సంపాదిస్తాడు.కంపెనీలో అత్యధికంగా సంపాదించేవారిలో ఒకడిగా నిలుస్తున్నాడు.
అతను రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాడు.
ఆ తర్వాత కూడా అతను సాయంత్రం, రాత్రి అత్యవసర పనులకు అందుబాటులో ఉంటాడు.
చాలా మంది ప్లంబర్లు సంవత్సరానికి £200,000 కంటే ఎక్కువ సంపాదించరు, కానీ Pimlico ప్లంబర్స్‌లోని సగం మంది ప్లంబర్లు £100,000 కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
"""/" /
పిమ్లికో ప్లంబర్స్‌ను 1979లో చార్లీ ముల్లిన్స్( Charlie Mullins ) ప్రారంభించారు.
వారు 24/7 సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నారు.స్టీఫెన్ ఫ్రై ప్లంబర్‌గా తన పనిని ఎంజాయ్ చేస్తున్నాడు, అయినప్పటికీ ఈ జాబ్ చేయడం వల్ల చాలా అలిసిపోతామని చెబుతున్నాడు.
అయినా వస్తున్న డబ్బు వల్ల అతను రోజూ సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు.తమ ఇళ్లలో నీటి లీకేజీల గురించి ఆందోళన చెందుతున్న చాలా మంది మహిళలకు తాను సహాయం చేశానని, వారు ఉపశమనం పొందడం తనకు సంతోషాన్ని కలిగించిందని అతను ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఈ కారణం చేత ఈ ఉద్యోగాన్ని తాను ఎప్పటికీ వదలనని పేర్కొన్నాడు.ఏది ఏమైనా ఈ ప్లంబర్ కథ విని చాలామంది నోరెళ్లబెడుతున్నారు.
నేను మీసం తిప్పితే ఓట్లు పడతాయా ? క్లాస్ పీకిన పవన్