మామతో వద్దంటూ అల్లుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పూజా హెగ్డే?
TeluguStop.com
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) తాజాగా విరూపాక్ష (Virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
సాయి ధరంతేజ్ ప్రమాదానికి గురైన తర్వాత నటించిన మొదటి సినిమా ఇలా మంచి సక్సెస్ కావడంతో ఈయన ఎంత సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈయన తన తదుపరి చిత్రాన్ని తన మామయ్య పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి బ్రో (Bro) అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా ఈనెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఇకపోతే ఈ సినిమా అనంతరం సాయి ధరంతేజ్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నారు.
"""/" /
ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.
అయితే ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించడం కోసం మేకర్స్ పూజ హెగ్డే (Pooja Hedge) ని సంప్రదించారని తెలుస్తుంది.
కథ మొత్తం విన్నటువంటి పూజ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ సమాచారం.
అయితే ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు అయితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
"""/" /
పూజా హెగ్డే ఇదివరకే పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరు మల్లు సినిమాలో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది.
అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పకున్నటు వంటి ఈమె ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.
ఇకపోతే మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో రాబోతున్నటువంటి గుంటూరు కారం (Gunturu Kaaram) సినిమాలో పూజ హెగ్డే నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
ఈ సినిమా నుంచి తప్పుకున్నటువంటి ఈమెకు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మేకర్స్ ప్రకటించే వరకు వేచి చూడాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆ బ్యూటీ అవసరమా.. ఇలా చేశావేంటి జక్కన్న?