వైరల్ న్యూస్: కడుపులో ఇనుప సామాను.. దిబ్రాంతికి గురైన వైద్యులు..
TeluguStop.com
ప్రతినిత్యం మనం సోషల్ మీడియా( Social Media ) ద్వారా ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ.
, ఇట్లే తెలిసిపోతుంది.అప్పుడప్పుడు కొందరి శరీర భాగాల్లో రకరకాల వస్తువులు కనిపించడం సంబంధించిన విషయాలు కూడా మనం మీడియా ద్వారా తెలుసుకునే ఉంటాము.
ఇందులో భాగంగానే శరీరంలో కొన్ని కేజీల అదనపు శరీర భాగాలు., ముఖ్యంగా మూత్రపిండాలలో వందల సంఖ్యలో రాళ్లు.
అలాగే కాలేయంలో వెంట్రుకలు ఇంకా అనేక రకాల వస్తువులు కనపడేలాంటి విషయాలు తెలుసుకునే ఉంటాం.
అయితే తాజాగా జైపూర్ లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.జైపూర్( Jaipur ) కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర కడుపునొప్పి కారణంతో ఆసుపత్రికి తరలించగా అతడి కడుపులో ఇనుప వస్తువులు ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు.
"""/" /
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలోకి వెళ్తే.తాజాగా జైపూర్ లోని సవాయినా మాస్ సింగ్ ( Mas Singh )హాస్పిటలకు ఒక యువకుడు కడుపునొప్పి కారణంతో అడ్మిట్ అయ్యారు.
హాస్పిటల్లోని సీనియర్ వైద్యుడైన రాజేంద్ర మాండియా ఆ యువకుడి కడుపులో సూదులు, తాళం, గింజలు, బోల్టలు ఉన్నట్లు ఎక్సరే, సిటీ స్కాన్ ద్వారా తెలుసుకున్నట్లు మీడియాతో తెలియజేశారు.
అంతేకాకుండా ముఖ్యంగా ఇనుప వస్తువులు ఆ యువకుడి పెద్ద పేగులో ఉన్నందుకు డాక్టర్ స్లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని తెలియజేశారు.
ఆ యువకుడి కడుపులో ఉన్న ఇనుప వస్తువులను( Iron Objects ) బయటకు తీసేందుకు దాదాపు 3 గంటల సమయం పట్టిందని వైద్యుడు తెలిపారు.
వాస్తవానికి ఆ యువకుడికి మానసికంగా బలహీనంగా ఉన్నందు కారణంగా ఆ ఇనుప వస్తువులు మింగేసినట్లు కుటుంబ సభ్యులు డాక్టర్స్ కి తెలియజేశారు.
ప్రస్తుతం ఆ యువకుడికి ఎటువంటి ఇబ్బంది లేదని కుటుంబ సభ్యులకు డాక్టర్స్ తెలిపారు.