వైరల్ : ఈ బామ్మ టాలెంట్ కు నెటిజన్స్ ఫిదా ...!

కృషి, పట్టుదల ఉంటే మనుషులు ఏదన్నా సాదించగలరనడానికి ఈ బామ్మ ఒక ఉదాహరణ అని చెప్పాలి.

మన దేశంలో చదువుకొని నిరక్షరాసులు చాలా మందినే ఉన్నారు.వారికి కూడా చదువు చెప్పి వారిలో తెలివితేటలూ పెంపొందించాలని మన ప్రభుత్వాలు అనేక మార్గాలను రూపొందించారు.

కానీ కొంతమంది మాత్రం ఈ వయసులో చదువు ఏంటి.? అని సిగ్గుపడుతున్నారు.

కానీ చదువుకోవడానికి వయస్సుతో పని లేదని నిరూపించారు ఈ బామ్మగారు.చదువుకోవడానికి వయసుకు సంబంధం ఏంటి అని సెంచరీ కొట్టేసిన వయసులో పలకాబలపం పట్టింది ఈ బామ్మా.

పలక నుంచి పేపర్ మీద పరీక్షలు రాసే వరకు వచ్చింది.అంతేనా పరీక్షలు రాసి డిస్టింక్షన్‌ లో పాసై అందరిని ఆశ్చర్య పరిచింది.

మరి ఆ బామ్మ గురించిన వివరాలు ఏంటో తెలుసుకుందామా.వివరాల్లోకి వెళితే.

కేరళలోని కొట్టాయాంకు చెందిన కుట్టియమ్మ అనే బామ్మా తన జీవితంలో ఒక్కరోజు కూడా స్కూలుకి వెళ్లి చదువుకోలేదు.

అందుకే తన 104 ఏళ్ల వయసులో కూడా కుట్టియమ్మ రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కేరళ స్టేట్ లిటరసీ మిషన్ నిర్వహించే క్లాసులకు వెళ్లి చదవడం నేర్చుకున్నది.

అలా కేరళ స్టేట్ లిటరసీ మిషన్ పెట్టిన లిటరసీ టెస్ట్‌లో 100కు 89 మార్కులు తెచ్చుకున్నది.

"""/"/కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాసుదేవన్ శివన్‌కుట్టి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపి కుట్టియమ్మను ప్రశంసించారు.

ప్రతిభ అనే ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి వయసు అడ్డంకి కాదని కుట్టియమ్మ నిరూపించారని పేర్కొన్నారు.

లిటరసీ టెస్ట్‌లో 89 మార్కులు సాధించడం ద్వారా 4వ తరగతి పరీక్షలు రాయడానికి కుట్టియమ్మ అర్హత సాధించారన్నమాట.

కేరళలో లిటరసీ రేటును మరింత పెంచే క్రమంలో కేరళ ప్రభుత్వం లిటరసీ మిషన్ అథారిటీని స్థాపించి, అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా చేసుకుంది.

అలా ఈ బామ్మ కూడా తన వయసుని లెక్క చేయకుండా చదువుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంది.

వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్న ఆ స్టార్ హీరో…