వైరల్: క్యాన్సర్ సోకిన మహిళకు ఇరుగుపొరుగువారు ఘన స్వాగతం… ఎమోషనల్ వీడియో!

క్యాన్సర్ ( Cancer )మహమ్మారి గురించి ఇక్కడ ఎవ్వరికీ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.

నేటి దైనందిత జీవితంలో ఎంతోమందిని క్యాన్సర్ భూతం వెంటాడుతోంది.పల్లె, పట్టణం అని తేడాలేకుండా ఇది అందరి ప్రాణాలను హరించి వేస్తోంది.

ఈ వ్యాధి సోకినవారు దాదాపుగా బతకడం కష్టం.అలాంటిది దీనినుండి బయటపడితే ఎలాగుంటుంది.

మరలా పునర్జన్మ వచ్చినట్టేకదా.అలా ఒకామె కాన్సర్ బారిన పడి ఇంటికి తిరిగొచ్చినపుడు ఆ వీధిలోని ఉన్నవాళ్ళంతా ఆమెకు ఘనస్వాగతం పలికారు.

"""/" / నమ్మశక్యం లేదా? ఇంట్లో సమస్యల్నే పట్టించుకునే టైం నేటి జనాలకి లేదు, ఇంకా ఇరుగుపొరుగువారి ( Neighbors )సమస్యలు వినేంత టైం ఎక్కడిది అంటారా? మనదగ్గర ఇది ఖాయమేమో కానీ, అక్కడ మాత్రం కాదు.

క్యాన్సర్‌తో పోరాడి జయించి వచ్చిన మహిళకు ఇరుగుపొరుగు వారు ఎలాంటి స్వాగతం చెప్పారో చూస్తే మీకు కన్నీరు తెప్పిస్తుంది.

అవును, క్యాన్సర్‌ని జయించి తిరిగి సంతోషంగా ఇంటికి వచ్చిన కైలీ ( Kylie )అనే మహిళకు ఇరుగుపొరుగువారు ఘన స్వాగతం పలికారు.

ఆమెను విష్ చేస్తూ సైన్ బోర్డులు, బెలూన్లు, రిబ్బన్లతో ఆమె నివాసం ఉండే ప్రాంతంలో నిలబడి ఆనందంతో ఆహ్వానించారు.

"""/" / కాగా ఈ క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేరై తెగ వైరల్ అవుతోంది.

ఈ క్రమంలో ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తోంది.క్యాన్సర్‌ని ఓడించి ఆమె మరింత అందంగా ఉందని కొంతమంది కామెంట్లు పెడితే, ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కొందరు దీవిస్తున్నారు.

ఆమె ఆత్మవిశ్వాసమే క్యాన్సర్ ని జయించేలా చేసిందని మరికొందరు కామెంట్లు పెట్టడం విశేషం.

కైలీ కోసం వీధి వీధంతా వచ్చి స్వాగతం పలికారంటే ఆమె తన ప్రాంతం వారిపట్ల ఎంత ఆప్యాయంగా మెలిగేదో కూడా అర్ధం చేసుకోవచ్చు.

అల్లు అర్జున్ అరెస్టు… వైరల్ అవుతున్న వేణు స్వామి వీడియో!