వైరల్: మాయదారి కోతులు వృద్ధురాలిని ఏం చేశాయో చూడండి.. కోతి బుద్ధి అంటే ఇదే!
TeluguStop.com
మీలో ఎవరన్నా చిలిపి చేష్టలు కలిగి ఉంటే, 'నీ కోతి బుద్ధి మనుకోవా?' అని చాలామంది చమత్కరిస్తూ వుంటారు.
అలాగే మనం కోతులనుండే వచ్చామని కొంతమంది మేధావులు చెబుతూ వుంటారు.అదంతా కొన్ని సార్లు నిజమేనని అనిపిస్తూ ఉంటుంది.
ఇకపోతే ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన కోతులు ఊళ్లలోకి వచ్చి జనులమీద పడి కరిస్తే ఎలావుంటుందో ఒకసారి ఊహించుకోండి.
అయితే నేటి కాలమాన పరిస్థితులను బట్టి కోతులు నిజంగానే జనావాసాల్లోకి వచ్చి నానా రచ్చ చేస్తున్నాయి.
అవును, ఇవి రైతుల పంటలతో పాటు మనుషుల ప్రాణాలతో కూడా ఆడుకుంటున్నాయి.తాజాగా జరిగిన ఓ సంఘటనే దీనికి ఓ ఉదాహరణ.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో నాలుగు కోతులు వృద్ధురాలిపై దాడికి దిగి బెంబేలెత్తించాయి.
ఈ క్రమంలో ఆమెకి చిన్న చిన్న గాయాలు అయినట్టు కూడా తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.వివరాలిలా వున్నాయి.
బుధవారం సాయంత్రం ట్యాంకు బండ్ రోడ్డులో ఓ ఇంట్లోకి కోతులు వచ్చాయి. """/"/
వాటిని తరిమేందుకుు వృద్ధురాలైన మల్లమ్మ ప్రయత్నించింది.
దాంతో ఆగ్రహించిన కోతులు మల్లమ్మపై దాడికి దిగాయి.ఈ సమయంలో ఆమె కేకలు వేసినా చుట్టు పక్కల వారు దగ్గరికే వెళ్లే సాహసం చేయలేకపోయారు.
ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అవ్వగా తాజాగా అవి సోషల్ మీడియా వేదికగా వెలుగు చూశాయి.
ఇలాగే తమకు కోతులు ఎల్లప్పుడూ ఇబ్బందిగా మారాయని సుల్తానాబాద్ వాసులు వాపోతున్నారు.ఇప్పటికైనా కోతులను అడవికి తరిమికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్కడ బాహుబలి మూవీ రికార్డును బ్రేక్ చేసిన మహారాజ మూవీ.. ఏం జరిగిందంటే?