వైరల్: బట్టలు ఉతుకున్న కోతి.. వైరల్ అవుతున్న వీడియో!

ఈ ప్రకృతిలో కొన్ని జంతువులు మనిషి మాదిరి ప్రవర్తిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.

అందులో కుక్క, కోతి, ఏనుగు, చింపాంజీ వంటి జంతువులు కొన్ని పనులను చేయడంలో మనుషులను అనుకరిస్తుంటాయి.

అవి అలా ప్రవర్తించినపుడు మన కంటపడితే మనసు వున్న చికాకు మాయమై చాలా సంతోషము కలుగుతుంది.

ఇవి చేసే పనులు ఎంత కోపంలో ఉన్నా నవ్వు తెప్పిస్తాయి.సోషల్ మీడియా పరిధి పెరగడంతో అలాంటి వీడియోలు అనేకం మనకు తారసపడుతూ వున్నాయి.

తాజాగా అలాంటి కోతి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇక్కడ కోతి ఒక దోబీ గా మారింది.అంతేకాకుండా బట్టలను ఎంతో సంతోషంగా ఇష్టంగా ఉతుకుతున్నట్లు కనిపిస్తోంది.

బేసిగ్గా అడవిలో నివసించే జంతువులు తమ ఆకలిని తీర్చుకోవడానికి ఇతర జంవుతులను వేటాడతాయి లేదా పండ్లను తిని కడుపు నింపుకుంటాయి.

అయితే మనిషికి మచ్చికైన కుక్క, కోతి వంటి జంతువులు మాత్రం.మనిషిని అనుకరిస్తూ.

వారు చేసిన పనులను చేస్తూ ఉంటాయి.తాజాగా ఓ కోతి మంచి ప్రొఫెషనల్ వాషర్‌మెన్‌లా బట్టలు ఉతుకుతుంది.

కోతి బట్టలు ఉతుకుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బట్టలకు అంటిన మురికిని తొలగించడానికి.ఆ బట్టలను బాది బాది మరీ అచ్చం ఓ దోబిలాగా ఉతుకుతోంది.

కోతి శ్రమ.ధోబీలా ఉతుకుతున్న తీరు చూసి నెటిజన్లు కోతికి ఫ్యాన్స్ అయ్యారు.

దాంతో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.'నేటితరానికి బట్టలు ఉతకడం అంటే ఏమిటో తెలియదు? చూసి నేర్చుకోండి' అని ఒకరంటే.

'మనుషులు ఇలా బట్టలు ఉతకడం వలన వాషింగ్ మెషీన్ల అవసరం ఉండదు.పైగా ఆరోగ్యం!' అని మరొకరు కామెంట్ చేసారు.

ఆ ఒక్కరు తలచుకుంటే మాత్రమే పోసానికి సినిమా ఆఫర్లు వస్తాయా.. ఏం జరిగిందంటే?