వైరల్: ఆ కొట్లాట చూసేందుకు ఫ్యామిలీతో సహా బయటికొచ్చిన మార్క్ జుకర్‌బర్గ్..

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ యూఎఫ్‌సీ మ్యాచ్‌కి తాజాగా హాజరయ్యారు.జుకర్‌బర్గ్ తన భార్యతో కలిసి ఈ భీకరమైన కొట్లాట చూసేందుకు విచ్చేశారు.

సాధారణంగా చాలా బిజీగా ఉండే జుకర్‌బర్గ్ తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి యూఎఫ్‌సీ ఆట చూసేందుకు వచ్చారు.

జుకర్‌బర్గ్ ఐరన్ కేజ్ పక్కన కూర్చొని ఆటను చూస్తూ ఎంజాయ్ చేశాడు.అతని భార్య ప్రిసిల్లా మాత్రం ఇద్దరు ఫైటర్స్ ఒకరికి ఒకరు పిడి గుద్దులు గుద్దుకుంటుంటే వామ్మో వాయ్యో అంటూ హడలిపోయారు.

ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, జుకర్‌బర్గ్ మెకెంజీ డెర్న్‌ను ప్రధాన ఈవెంట్‌లో చూసినందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ ఈవెంట్‌కు తనను ఆహ్వానించినందుకు డ్యానా వైట్‌కి ధన్యవాదాలు తెలిపారు.జుకర్‌బర్గ్ కూడా ఈ ఫైటర్స్ లాగా బాగా స్ట్రాంగ్ గా ఉండేందుకు రోజూ వర్కౌట్ చేస్తారు.

ఆ తర్వాత చాలా సేపు స్నానం చేస్తారు.ఖాళీగా ఉన్నప్పుడు బ్రాడ్ ఫిట్ మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు.

టెన్నిస్ ఆట కూడా ఆడతారు.ఇప్పుడు ఎమ్ఎమ్ఏ ఫైట్ కూడా తనకు ఇష్టమైనని చెప్పకనే చెప్పాడు.

"""/"/ @breezygoblue అనే ట్విట్టర్ యూజర్ తాజాగా షేర్ చేసిన వీడియోలో జుకర్‌బర్గ్, భార్య ప్రిసిల్లా ఎమ్ఎమ్ఏ మ్యాచ్ చూస్తూ కనిపించారు.

ప్రిసిల్లా చాలా భయపడి పోతూ కనిపించడం కూడా ఇందులో మీరు చూడవచ్చు.ఈ వీడియోకి ఇప్పటికే ఏడు లక్షలకు పైగా వ్యూస్, ఆరు వేల వరకు లైకులు వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?