వైరల్: ఓ రెస్టారెంట్‌కి అతడు తన ఒంటెతో వెళ్ళాడు.. ఎందుకంటే?

వైరల్: ఓ రెస్టారెంట్‌కి అతడు తన ఒంటెతో వెళ్ళాడు ఎందుకంటే?

సోషల్ మీడియాలో ఈమధ్య ఎక్కువగా జంతువులకు చెందినవి వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఒక వీడియో ఆహుతులను ఎంతగానో అలరిస్తోంది.

వైరల్: ఓ రెస్టారెంట్‌కి అతడు తన ఒంటెతో వెళ్ళాడు ఎందుకంటే?

తాజాగా అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇన్ అండ్ అవుట్ రెస్టారెంట్‌లోకి ఓ వ్య‌క్తి ఏకంగా త‌న ఒంటెతో కలిసి వెళ్ళాడు.

వైరల్: ఓ రెస్టారెంట్‌కి అతడు తన ఒంటెతో వెళ్ళాడు ఎందుకంటే?

అంతేకాదు, అక్కడికి వెళ్లి తమకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసి తీసుకువెళుతున్న ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చాలా ఎక్కువ వీక్షణలు పొందుతోంది.

ఇక్కడ కనబడుతున్న వీడియో విషయానికొస్తే, అమెరికాలోని లాస్ వెగాస్‌లో ఇన్ అండ్ అవుట్ రెస్టారెంట్‌కి ఓ వ్య‌క్తి తన భారీ పెంపుడు జంతువు అయినటువంటి ఓ ఒంటెను రెస్టారెంట్‌లోకి రావ‌డం చూసి మొదట అక్క‌డున్న వారితో పాటు రెస్టారెంట్ సిబ్బంది కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

మొదట వారికి అక్కడ ఏం జరుగుతోందో అర్ధం కాలేదు.తరువాత తేరుకొని వారిని ఏం కావాలని అడిగారు.

దాంతో అతడు ఫుడ్ కోసం వచ్చామని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నవ్వారు.అక్టోబ‌ర్ 4న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వెలుగు చూడటం గమనార్హం.

విషయం ఏమంటే, నెవాడాకు చెందిన బ్రాండ‌న్ నోబుల్స్.ఫెర్గీ అనే ఒంటెను వెంట‌బెట్టుకుని రెస్టారెంట్‌లోకి వ‌చ్చిన వీడియోను నౌ దిస్ న్యూస్ అనే ఇన్‌స్టాగ్రాం అకౌంట్ షేర్ చేసింది.

"""/"/ 12 ఏండ్ల వ‌య‌సున్న ఫెర్గీకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్ట‌మ‌ని సదరు వీడియోకు క్యాప్ష‌న్‌గా పెట్టడం ఇక్కడ కొసమెరుపు.

ఇకపోతే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజ‌న్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

లాస్ వెగాస్‌లో ఏదైనా సాధ్య‌మేన‌ని ఓ వ్య‌క్తి కామెంట్ చేయ‌గా, మరోవ్యక్తి.అలా జంతువులను వెంటబెట్టుకొని బయటకి వెళ్తే అది జీవ హింస కింద‌కు వ‌స్తుంద‌ని కామెంట్ చేశారు.

ఆది పినిశెట్టి హీరోగా సక్సెస్ అయినట్లేనా..?