వైరల్: ప్రశాంతతకోసం 200 రోజులుగా టెంట్‌లోనే నివాసం… బయటకి రాడట?

అవును, వినడానికి ఆశ్చర్యంగా వున్నా, ఇది నిజమే.నేటి మానవుడికి ప్రశాంతత కరువవుతుందనేది వాదన లేని అంశం.

ఈ క్రమంలోనే కొంతమంది వివిధ ప్రాంతాలకు వెళ్లడమో, తమకు ఇష్టమైన పనులలో నిమగ్నమై ఉండడం చేస్తుంటారు.

అయితే ఓ యువకుడు మానసిక ప్రశాంతత కోసం కోసం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి, టెంట్‌లో నివాసం ఉంటున్నాడు.

వింతగా అనిపించినా ఇది నిజం.ఓ చైనా ( China )యువకుడికి ఉద్యోగం మీద విరక్తి కలిగి రిజైన్ చేసాడు.

ఆ తరువాత టెంట్‌కి పరిమితం అయిపోయాడు.దాంతో అతగాడు ఇపుడు హాట్ టాపిక్ అయ్యాడు.

"""/" / చైనా సిచువాన్‌( Sichuan )కు చెందిన 29 ఏళ్ల లిషు అనే యువకుడు చేసే పనిమీద విరక్తి చెంది 2018 నుంచి జాబ్ మానేశాడు.

తరువాత అద్దె కట్టడం కష్టం కావడంతో తన దగ్గర ఉన్న కంప్యూటర్, కెమెరా అమ్మేశాడు.

అవి అమ్మగా 400 యువాన్లు (రూ.4,700) రాగా వాటితో ఓ సెకండ్ హ్యాండ్ టెంట్ కొని రాళ్లు, రప్పలు నిండి ఉన్న కార్లు పార్క్ చేసే ఏరియాలో టెంట్ వేసుకొని నివాసం ఉంటున్నాడు.

ఆ టెంట్‌లో రిలాక్స్ అవుతూ తనకి నచ్చినవి వండుకుంటూ తింటున్నాడు. """/" / ఆ టెంట్‌కి బోర్డు కూడా పెట్టాడండోయ్.

టెంట్‌లో ఉన్న వస్తువులు ముట్టుకోవద్దని.తాను అక్కడ టెంపరరీగా ఉండటానికే వచ్చానని, ఎవరికైనా అభ్యంతరం ఉంటే అక్కడి నుంచి వెళ్లిపోతానని కూడా ఆ బోర్డ్ లో పేర్కొన్నాడు.

అయితే అవసరానికి లిషు అప్పుడప్పుడు బయటకు వెళ్తుంటాడు.బ్యాటరీ రీఛార్జ్( Battery Recharge ) చేసుకోవడానికి, వంట సామాగ్రి కోసం మాత్రమే వెళ్తుంటాడు.

ఇతని కష్టాలు చూసిన స్నేహితుడు అకామిడేషన్ ఇస్తానని, బిజినెస్ ఆఫర్ ఇస్తానని బతిమాలినా లిషు ససేమిరా అన్నాడు.

అతని దగ్గర ఉన్న డబ్బులు అయిపోయిన వరకు తను కోరుకున్న ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతానని చెప్పుకొస్తున్నారు ఆ కుర్రాడు.

పీరియడ్స్ ఆన్ టైమ్ కి రావాలంటే ఇలా చేయండి..!