వైరల్: ఎద్దుని వేటాడుతున్న చిరుత.. ప్రాణం కోసం పోరాడుతున్న ఎద్దు.. ఎమోషనల్ వీడియో!
TeluguStop.com
సోషల్ మీడియా విస్తృతి పెరిగుతున్నవేళ అనేకరకాల వీడియోలు పోస్టు అవుతున్నాయి.అందులో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే దానికి అనేక కారణాలు వున్నాయి.అందులో కొన్ని మనసుని హత్తుకునేవి ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.
ఇంకొన్ని కాస్త బాధకు లోనయ్యేలా చేస్తాయి.ఇలా ఎదో ఒక ఎలిమెంట్ లేకపోతే అవి వైరల్ అవ్వనే అవ్వవు.
ఇక ముఖ్యంగా ఇందులో ఎక్కువగా జంతువులకు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా మనకు తారసపడతాయి.
తాజాగా జంతువులకు సంబంధించినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.అరణ్యంలో ఒక జీవి ఆకలికి మరో ప్రాణి బలి కావాల్సిందే.
తమ ఆకలి తీర్చుకోవడానికి బలమైన జంతువులు బలహీన జంతువులపట్ల అమానుషంగా ప్రవర్తిస్తాయి.సింహాలు, చిరుతలు, పులులు, తోడేళ్లు ఇలా అనేక రకాల జంతువులు ఇతర జంతువుల ప్రాణాలు హరిస్తూ ఉంటాయి.
వాటి వేటకు సంబంధించిన వీడియోస్ మనం రెగ్యులర్ గా చూస్తుంటాము.అలాంటి ప్రమాదకరమైన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియో చూస్తే మనకు ఉత్కంఠతగాను, ఒకింత బాధగాను అనిపించక మానదు.ఆ వీడియోలో రోడ్డు పక్కనే ఓ ఎద్దుపై చిరుతపులి దాడి చేసింది.
ఎద్దు మెడను తన నోటితో గట్టిగా పట్టేసింది.రోడ్డుపై ఎద్దు ఉండంగానే రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్ కింది నుంచి దాని మెడను పట్టుకుంది.
చిరుత నుంచి విడిపించుకునేందుకు ఎద్దు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.చివరకు ప్రాణాలు వదిలింది.
దీంతో వెంటనే ఎద్దును రోడ్డు పక్కకు లాక్కెల్లి పోయింది చిరుత.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వీడియో తీయకుండా ఆవు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నం ఎందుకు చేయలేదంటూ ఫైర్ అవుతున్నారు.
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!