వైరల్: అది చూడడానికి మొక్కజొన్న చేనులాగా ఉంటుంది.. లోపలికెళ్లి చూస్తేనే అసలు రంగు తెలిసేది?
TeluguStop.com
ఇక్కడ బడాబాలులు అని చెప్పుకు తిరిగే చాలామంది తప్పుడు మార్గాల్లో దండిగా సంపాదిస్తున్నవారనే విషయం అందరికీ తెలిసినదే.
అయితే ఎవరు ఎలా సంపాదిస్తున్నా కొంతమంది మాత్రం వారు చేసే తప్పుడు పనుల్లోనే తమ క్రియేటివిటీని వాడుతుంటారు.
అదేదో పుష్ప సినిమాలో దొంగతనంగా ఎర్రచందనం తీసుకెళ్లిన మాదిరి లెక్క అనుకోవచ్చు.అలా తమ ఇస్మార్ట్ బుర్రలతో పోలీసులకు, అధికారులకు చుక్కలు చూపిస్తూ వుంటారు.
"""/" /
ఇప్పుడు మనం చెప్పుకోబోయే కధ కూడా అలాంటిదే.రెండు పఫ్స్ లాగగానే కిక్కిచ్చే మత్తు పదార్ధాలలో గంజాయి( Marijuana ) ఒకటి.
ఇది ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో విరివిగా దొరకుతుంది.దీన్ని పీల్చుతూ.
కలల లోకంలో తెలియాడుతూ, విలువైన జీవితాన్ని పాడుచేసుకున్నవారు ఇక్కడ చాలామంది వున్నారు.గంజాయి పెంపకం, వినియోగం అనేది ఇపుడు భారతదేశంలో( India ) విపరీతంగా పెరిగిపోయింది.
అధికారులు సదరు కేటుగాళ్లను కేసులు పెట్టి, జైల్లో వేస్తున్నా వారి పద్దతి మార్చుకోవడం లేదు కదా రోజుకో కొత్త ఎత్తు వేస్తూ పోలీసులకే సవాళ్లు విసురుతున్న పరిస్థితి.
"""/" /
విషయంలోకి వెళితే, గుజరాత్‌లోని పంచమహల్ ( Panchmahal In Gujarat )జిల్లా షెహ్రా( Shehra ) తాలూకా బోరియా గ్రామంలో మొక్కజొన్న తోట లోపల గంజాయి సాగు చేస్తున్న.
ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు.గ్రామంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బస్ కండక్టర్ అయినటువంటి శంకర్ మావ్జీభాయ్ దోడియార్ తన ఇంటి సమీపంలో ఉన్న పొలంలో గుట్టుగా మొక్కజొన్న పేరు చెప్పి పక్కా నాటు గంజాయి సాగు చేస్తున్నాడు.
పక్క సమాచారం అందుకున్న స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అకస్మాత్తుగా ఆ పొలంలో దాడులు చేసి 33 పచ్చి గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆ గంజాయి బరువు 54.72 కిలోలు ఉండగా, స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ.
5.47 లక్షలు ఉంటుందని తెలిపారు.
నిందితుడిపై కేసు నమోదు చేసి.రిమాండ్‌కు తరలించారు.
రామ్ చరణ్ ఉపాసన ఆస్తుల విలువ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!