వైరల్: ఎప్పుడూ రీల్స్ చూడడం కాదు, నేటితరం అంటే ఇలా ఉండాలి?

నేడు ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లలపై జరుగుతున్న అధ్యయనాలలో విస్తు పోయే విషయాలు వెల్లడౌతున్నాయి.

దాదాపుగా 70 శాతానికి పైగా చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్స్ కి అంకితం అయ్యి, రీల్స్ చూడడమో, లేదంటే గేమ్స్ అంటూ చదువుని మరచి, సమయం వృధా చేస్తున్న పరిస్థితి.

ఇటువంటి తరుణంలో నేడు ప్రపంచ వ్యాప్తంగా కొంతమంది చిన్నారులు మాత్రం కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పట్టుసాధిస్తున్నారు.

ఈ ట్రెండ్‌కు భారత్‌ కూడా అతీతం కాదనేలా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారడం విశేషం.

"""/" / ప్రస్తుతం ఏఐ రాజ్యమేలుతున్నవేళ,( AI Reigns Supreme ) చిన్నతనం రూపురేఖలే మారిపోతున్నాయని కళ్లకు కట్టినట్టు ఈ వీడియో మనకు చూపిస్తోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ ముగ్గురు పిల్లలు ఓ అప్లికేషన్ కోడ్ గురించి వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించడం విశేషం.

వృత్తినిపుణుల రేంజ్‌లో వారి వాదం సాగడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.ఒకరేమో ఆ ప్రోగ్రామ్ ప్రాథమిక స్థాయిలోనే ఉందని కామెంట్ చేస్తే, మరొకరేమో ప్రోగ్రామ్ యూఐ, బటన్స్, రంగులు ( UI, Buttons, Colors )నచ్చాయని కామెంట్ చేయడం కొసమెరుపు.

మిగిలిన కుర్రాడు ఈ ప్రోగ్రామ్‌కు మరిన్ని ఫీచర్స్ యాడ్ చేస్తే బావుంటుందని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

నిపుణులైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల వీడియో కాన్ఫరెన్స్‌ను తలపించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ నెట్టింట పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.

"""/" / దాంతో.ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్, వేల కొద్దీ కామెంట్స్, లైకులు వస్తున్నాయి.

‘‘ఆటలు ఆడటం, కార్టూన్లతో సమయం గడపాల్సిన ఈతరం చిన్నారులు ఏకంగా కోడింగ్ గురించి మాట్లాడడం విశేషం!’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.

‘‘రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్న ఈ సమయంలో చిన్నారులకు కోడింగ్ పరిచయం చేయడం ఉత్తమమైన మార్గమే!’’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు.

‘‘కోడింగ్‌కు సంబంధించి ఓ చిక్కు సమస్య ఉండేది.అయితే, 14 ఏళ్ల బాలుడు చేసిన ఓ యూట్యూబ్‌ వీడియోలో దీని పరిష్కారం లభించింది’’ అంటూ మరో వ్యక్తి నేటి చిన్నారుల రేంజ్ కళ్లకు కట్టినట్టు వివరించాడు.

ఇలా రకరకాల కామెంట్స్ ఈ వీడియో సొంతం చేసుకుంటోంది మరి!.

వైరల్ వీడియో: మనిషి ప్రయాణించే డ్రోన్ టాక్సీ తయారు చేసిన ఇంటర్ విద్యార్థి