వైరల్: దీనినే టక్కరి పిట్ట అని అంటారేమో… దొంగతనం చేసి యజమానికి ఇచ్చేస్తోంది!
TeluguStop.com
మీరు రకరకాల దొంగతనాలను చూసి వుంటారు.పక్కింట్లో దొంగలు పడడం, పక్కన ఉన్న షాపులో నుంచి కన్నం వేసి గోల్డ్ షాపులోకి దూరి బంగారం కొట్టేయడం, బ్యాంకులో దొంగతనం, ఏటి ఎం దొంగతనం ఇలా రకరకాల దొంగతనాల గురించి మనం నిత్యం వింటూ వుంటాము.
అయితే ఇప్పుడు చెప్పబోయే దొంగతనం వీటన్నింటికి మించి అని చెప్పుకోక తప్పదు.ఇంతకీ ఆ దొంతతనం చేసింది ఏ ప్రొఫెషినల్ దొంగో, లేక అనుభవం లేక పట్టుబడిపోయిన దొంగో అనుకుంటే పొరపాటే.
అవును, ఇక్కడ మనం ఓ పిట్ట దొంగతనం గురించి మాట్లాడుకోవాలి. """/" /
మీకు ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియోను అటహరెకట్ ఎక్స్( Ataharecut X )(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది.
ఈ వీడియోని మనం గమనించినట్టైతే ఓ పిట్ట బయట వీధిలో నుంచి ఇంట్లోకి రావడం మనం చాలా స్పస్టంగా చూడవచ్చు.
ఆ పక్షి( Bird ) నల్లగా ఉంది.దానిలో నోటిలో మనం కరెన్సీ నోట్లు వుండడం మనం చూడవచ్చు.
అది ఎగురుకుంటూ వచ్చి నేరుగా ఇంట్లో ఉన్న ఒక డ్రాయర్ వద్ద ఆగుతుంది.
కొంచెం సేపటికి ఆ సొరుగు తెరుచుకుంటుంది.వెంటనే ఆ పిట్ట ఆ నోటును దానిలో వేస్తుంది.
ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఈ సొరుగులో చాలా కరెన్సీ నోట్లు ఉన్నాయి.అంటే ఆ పిట్ట అన్ని నోట్లను కొట్టేసి ఇంట్లో తెచ్చి పెట్టినట్టు మనకు ఇట్టే అర్ధం అయిపోతుంది.
"""/" /
ఇక పిట్ట నోట్లను డ్రాయర్ లో వేస్తూ ఉండగా పెంపుడు కుక్క దాని వద్దకు వస్తుంది.
అది ఎలా వేస్తుందో అని చాలా నిశితంగా పరిశీలిస్తూ వుండడం మనం చూడవచ్చు.
కాగా ఇది చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.ఇలాంటి పిట్ట ఒక్కటి ఉంటే చాలు పనిచేయకుండా బతికేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మరికొందరు ఇదంతా ఫేక్ వీడియో అని కొట్టిపడేస్తున్నారు మరి.ఇంకొందరు మాత్రం ఈ పిట్టకు ఇలా ట్రైనింగ్ ఇచ్చిన వారు చాలా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు.
ఇలా కూడా దొంగతనాలు జరిగితే మేం ఏం చేయాలి బాబు అంటూ మరికొందరు తెగ టెన్షన్ పడుతున్నారు.
ఇలా వారి ఫీలింగ్స్ ని కామెంట్స్ రూపంలో పెడుతున్నారు.