వైరల్: నీ పెళ్లాన్నేనా? నన్ను కూడా ఎత్తుకో మరి! అంటూ దంపతుల మధ్య దూరిన కోతి!
TeluguStop.com
స్మార్ట్ ఫోన్ మనుషులను ఎంతగానో ప్రభావితం చేస్తోంది.ఈ క్రమంలో సోషల్ మీడియా కూడా బాగా విస్తరించింది.
దాంతో రోజూ కొన్ని వేల సంఖ్యలో వీడియో కంటెంట్ ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది.
అయితే అందులో ఏ కొన్నో నెటిజన్ల మనసులను హత్తుకుంటూ ఉంటాయి.దాని వలన అవి వైరల్ అవుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా కోతులకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సదరు కోతి విన్నపాన్ని విని నెటిజన్లు మాత్రమే కాదు, వీడియోలో వున్న కొత్తపెళ్లి కొడుకు కూడా అవాక్కయ్యాడు.
వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే, ఓ కొత్తజంట ఎంతో ఉత్సాహంగా వెడ్డింగ్ షూట్‌కు రెడీ అయింది.
కొత్త పెళ్లి కొడుకు చాలా రొమాంటిక్ గా తనకు కాబోయే పెళ్ళాన్ని పట్టుకొని గాల్లో గిరగిరా తిప్పుతున్నాడు.
అలాగే మురిపెంగా ముద్దులాడి ప్రయత్నం చేస్తున్నాడు.ఇంతలో హఠాత్తుగా అక్కడికి తన బిడ్డను ఎత్తుకొని వున్న ఒక మెక్సికన్ స్పైడర్ కోతి దూసుకు వచ్చి నూతన దంపతుల ఫోటో షూట్ కి అంతరాయం కలిగిస్తుంది.
దాంతో కోతి రావడాన్ని ఒక్కసారిగా చూసిన వధువు కాస్త భయపడుతుంది. """/"/
అయితే ఆ కోతి వారిపైన దాడి చేయకుండా అక్కడే ఉన్న వరుడి చేతిని పట్టుకుని నన్ను కూడా ఎత్తుకో అని ఆజ్ఞాపిస్తున్నట్టు చూస్తుంది.
ఇక చేసేదేమిలేక ఆ వరుడు నవ్వుకుంటూ ఆ కోతిని ఎత్తుకుంటాడు.దాంతో వధువు కూడా కోతి దగ్గరకు వెళ్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లోని 'ఫైర్ అండ్ ఐస్' అనే ఖాతా నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవుకుంటున్నారు.
ఇక నెటిజన్లు అయితే వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.ఆ క్రమంలోనే ఒక నెటిజన్ సరదాగా స్పందిస్తూ కోతిని కూడా పెళ్లిచేసుకో గురు అని ఫన్నీగా కామెంట్ చేయడం చూడవచ్చు.
జిడ్డుగల చర్మంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!