వైరల్ : ఈసారి KGF 2 ను వాడేసుకున్న హైదారబాద్ పోలీసులు..!

హైదారబాద్ పోలీసులు సందర్భాన్ని బట్టి మన సినిమాలను వాడేసుకుంటూ వుంటారు.తాజాగా ట్రాఫిక్ చాలానాల విషయంలో ఓ వినూత్న ఐడియాని అవలంబించారు.

ఈ క్రమంలో KGF 2 తాజా ట్రయిలర్ ని ఉపయోగించుకున్నారు.అవును.

"ఇంకా 3 రోజులే మిగిలి వున్నాయి.మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి.

ఈ అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చుకోకండి.ప్రభుత్వం ఇచ్చిన రాయితీని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి అంటూ ఓ నినాదాన్ని చేస్తున్నారు.

ఈ క్రమంలో కె.జి.

యఫ్‌ ఛాప్టర్‌ 2 ట్రైలర్‌ లోని "ఆఫర్‌ క్లోజెస్‌ సూన్‌" డైలాగ్‌ మీమ్‌ ను వాడటం విశేషం.

ఆలస్యం చేయకు మిత్రమా.ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అంటూ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక ఇప్పటికీ కూడా వాహనాల చలాన్‌ లను క్లియర్ చేసుకోకుంటే.వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించండి.

లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సుమా.! అంటూ ఓ హెచ్చరికను జరీ చేసారు.

సదరు విషయాన్ని గమనించిన నెటిజన్లు ఐడియా సూపర్ అంటూ సోషల్ మీడియాలో కమిటీలు పెడుతున్నారు.

ఇక అసలు విసమయలోకి వెళితే., తెలంగాణలో 50% చలానాలు క్లియర్‌ కాగా 50% పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో వున్నట్టుగా తెలుస్తోంది.

ఓ స్కూటర్ ఓనర్‌ కు.అత్యధికంగా 178 చలాన్లు ఉండటం గమనార్హం.

హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయని తెలుస్తోంది.ఇక ఆగస్టు 2019 నుండి ఇప్ప‌టివ‌ర‌కు 178 చలాన్ల‌ మొత్తం రూ.

48,595 గా ఉంది.రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ.

12,490గా వుంది.మరో స్కూటరిస్ట్ కి రూ.

73,690 ల చలాన్లు ఉన్నాయని, అతను ప్ర‌త్యేక రాయితీని వాడుకొని 19, 515 చెల్లిస్తే సరిపోతుంది.

మరి వీరు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారో లేక ఫైన్ కట్టక తగిన మూల్యం చెల్లించుకుంటారో తెలియాల్సి వుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరో అతనే.. ప్రభాస్ తర్వాత ఆ స్థాయి ఎవరిదంటే?