వైరల్ : కోతుల ఫెస్టివల్ గురించి ఎక్కడైనా విన్నారా మీరు..?!

కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు.ఒక్కోసారి అవే చేసే అల్లరి పనులు నవ్వు తెప్పిస్తాయి.

మరికొన్ని సార్లు అవే చేసే అల్లరి చూసి విస్తిపోతూ ఉంటాము.అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడ చుసిన కోతులె మనకి దర్శనం ఇస్తాయి.

కోతుల గుంపులను చూడాలంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలిసిందే.ఎందుకంటే అక్కడ ప్రతి యేటా మంకీ ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి.

ఆ ఫెస్టివల్ లో చాలా కోతులు మనకు కనిపిస్తాయి.అలాగే అక్కడ ఉన్న కోతుల కోసం చాలామంది ఎన్నో రకాల పండ్లను తీసుకువచ్చి వాటికి పెడుతూ ఉంటారు కూడా.

అవి కూడా ఎంచక్కా మంకీ ఫెస్టివల్ పుణ్యమా అని ఇష్టమైన పండ్లను ఆరగించేస్తూ తెగ ఎంజాయ్ చేస్తాయి.

ఇంతకు ఈ మంకీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని ఆశ్చర్యపోతున్నారు కదా.థాయ్‌లాండ్‌ లో ఈ మంకీ ఫెస్టివల్‌ ను ప్రతి యేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఈ మంకీ ఫెస్టివల్ దృశ్యాలు ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.అయితే కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లపాటు నిలిచిపోయిన మంకీ ఫెస్టివల్ మళ్ళీ ఈ ఇప్పుడు ఘనంగా ప్రారంభమైంది.

వేలాది కోతులు థాయిలాండ్‌ లోని లోప్‌బురి అనే ప్రాంతానికి చేరి సందడి చేస్తున్నాయి.

అలాగే ఆ ప్రాంతానికి వేలాది మంది టూరిస్టులు కూడా వస్తారు.అలాగే ఈ మంకీ ఫెస్టివల్ కోసం రెండు టన్నుల పండ్లు, కూరగాయలను ఏర్పాటు చేసినట్లు అక్కడి నిర్వాహకులు తెలిపారు.

"""/"/ అలాగే ఈ ఫెస్టివల్‌ లో కోతులు కూడా మనుషులను చూసి భయపడకుండా కొందరు వ్యక్తులపై కూర్చొని హాయిగా పండ్లను తినడం మనం ఫొటోల్లో చూడవచ్చు.

అయితే కరోనా కాబట్టి రెండు కరోనా టీకాలు తీసుకున్న పర్యాటకులను మాత్రమే ఈ ఫెస్టివల్ కు అనుమతించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం నవంబర్‌ లో నిర్ణయం తీసుకుంది.

కాగా ఈ ఫెస్టివల్ ను ప్రతి ఏడాది నవంబర్ చివరి వారంలో నిర్వహిస్తారు.

ఈ ఫెస్టివల్‌ను ఆ ఊరి పెద్ద యోంగ్యుత్ కిత్వాటానాసోంత్ నిర్వహిస్తారు.ప్రతీ ఏడాది ఒక థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు.

దాదాపు రెండు ఏళ్ళు ఈ మంకీ ఫెస్టివల్ ను జరిపించలేదు.మళ్ళీ ఇప్పుడు జరిపించడంతో అక్కడి కోతులు ఎంతో ఇష్టంగా తమకు నచ్చిన పండ్లను మనసారా తింటున్నాయి అని అక్కడి నిర్వాహకులు అంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, గురువారం 2024