అందంగా ఉండడం ఆ అమ్మాయికి ఇబ్బందిగా మారిందా? వీడియో వైరల్

ఉత్తర ప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా( Kumbh Mela ) ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది.

ఈ మహత్తరమైన వేడుకకు వచ్చిన లక్షలాది భక్తుల మధ్య ఓ పూసలు అమ్ముకునే అమ్మాయి అనుకోకుండా సోషల్ మీడియాలో స్టార్‌గా మారింది.

ఇండోర్‌కు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోస్తే( Monalisa Bhoste ) తన నీలి కళ్లతో, స్వచ్ఛమైన చిరునవ్వుతో, అమాయకత్వంతో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.

మోనాలిసాకు సంబంధించిన ఒక చిన్న వీడియో అనుకోకుండా వైరల్ అవడంతో ఆమె జీవితంలో భారీ మార్పులు వచ్చాయి.

దాంతో ఆమెను సోషల్ మీడియా ఓవర్ నైట్ లో సెన్సేషన్‌గా నిలిపింది.నెటిజన్లు ఆమెను ప్రేమగా "బ్రౌన్ బ్యూటీ"( Brown Beauty ) అంటూ ప్రేమగా కామెంట్స్ చేశారు.

"""/" / ఇది ఇలా ఉండగా ఇప్పుడు మోనాలిసా గుర్తింపును పొందడం ఆమె కుటుంబానికి ఆనందకరమైన విషయమే.

కానీ అదే సమయంలో, ఈ ప్రాచుర్యం ఆమె కుటుంబానికి ఇబ్బందులను కూడా తెచ్చింది.

కుంభమేళాకు వచ్చిన యూట్యూబర్లు, భక్తులు ఆమె దగ్గరకు చేరుకుని సెల్ఫీలు తీసుకోవడం, వీడియోలు తీశారు.

దీనితో ఆమెకు వ్యాపారాన్ని చేయడంలో ఆటంకంగా మారింది. """/" / ఈ పరిస్థితులు తీవ్రమవడంతో ఆమె తండ్రి ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని నిర్ణయించారు.

కుంభమేళాలో బతుకుదెరువు కోసం వచ్చిన ఈ కుటుంబానికి వ్యాపారం చేయలేకపోవడంతో, మోనాలిసాను ఇంటికి పంపించాల్సి వచ్చింది.

మోనాలిసా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పేదింటి అమ్మాయి జీవితం ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవడం పై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.

ఒకవైపు కొందరు మోనాలిసా స్టార్‌గా మారడాన్ని ప్రోత్సహిస్తుండగా, మరికొందరు ఈ ప్రాచుర్యం ఆమె జీవితానికి సమస్యలు తెచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన మరో కోలీవుడ్ హీరో.. ఈ హీరో సక్సెస్ సాధిస్తారా?