పిల్లలకు వచ్చే వైరల్ ఫీవర్‌ను ఈ అయిదు చిట్కాలతో ఎదుర్కోండి.. ప్రతి తల్లి, తండ్రి తెలుసుకోవాల్సిన విషయం
TeluguStop.com
సీజన్‌ను బట్టి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి.వైరల్ ఫీవర్స్‌ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదని భావిస్తూ ఉంటాం.
వచ్చి అవే వెళ్లి పోతాయి అనుకుంటాం.కాని వైరల్ ఫీవర్స్ పిల్లలకు రావడం మాత్రం సీరియస్‌గా పరిగణించాలి.
పిల్లలకు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి.ఎందుకంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది.
అందువల్ల వైరల్ ఫీవర్ అనేది చాలా స్పీడ్‌గా ఎటాక్ అవుతుంది.వైరల్ ఫీవర్స్ ఎటాక్ అవ్వగానే ఆ మందులు ఈ మందులు, ఆ సూదులు అంటూ పిల్లలను ఇబ్బంది పెట్టకుండా కొన్ని సహజ పద్దతుల్లో ఆ ఫీవర్‌ను తగ్గించుకోవచ్చు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఆ సహజ పద్దతుల వల్ల వైరల్ ఫీవర్ తగ్గడంతో పాటు, దాన్ని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా పిల్లాడిని ఏమాత్రం ఇబ్బంది పెట్టవు.
ఆ పద్దతులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.పిల్లలకు జర్వం వచ్చిన సమయంలో వారిలో రోగ నిరోదక శక్తి పెంచాల్సిన అవసరం ఉంటుంది.
అందుకే మొదట వారికి రెండు టీ స్పూన్ ల తేనెతో కాస్త అల్లం రసంను పట్టించాలి.
దాంతో వారిలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.వేడి నీళ్లలో దాల్చిన చెక్క వేయించి ఆ నీటిని తాగించడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రెండు స్పూన్ ల ఆవ నూనె తీసుకుని, దాంట్లో రెండు వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి ఆ మిశ్రమాన్ని పాదాలకు పెట్టి బాగా మర్థన చేయాలి.
దాంతో జర్వం చాలా వరకు నయం అయ్యే అవకాశాలుంటాయి.తులసి ఆకు మంచి యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది.
శరీర రోగ నిరోదక శక్తిని పెంచడంతో పాటు వైరల్ ఫీవర్‌ను పోగొడుతుంది.తులసి ఆకును లీటరు నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని తాగించడం వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇక దనియాల పొడితో కషాయం తయారు చేసి పిల్లలకు తాగించడం వల్ల కూడా వైరల్ ఫీవర్ తగ్గుతుంది.
దనియాల పొడిని నీటిలో వేసి బాగా మరిగించి, ఆ తర్వాత వడగట్టి గోరు వెచ్చటి నీటిని తాపించాలి.
ఇలా చేయడం వల్ల కూడా వైరల్ ఫీవర్ తగ్గుతుంది.ఈ పద్దతులను రెండు రోజులు చూసిన తర్వాత కూడా జ్వరం తగ్గకుంటే వెంటనే హాస్పిటల్‌కు తీసుకు వెళ్లడం ఉత్తమం.
మరీ ఆలస్యం చేయడం వల్ల వైరల్ ఫీవర్ టైపాయిడ్‌గా మారే అవకాశం ఉంటుంది.
టీ పొడితో జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చని మీకు తెలుసా..?