వైరల్: కొబ్బరి బోండాంలో నిమ్మరసం కలుపుకొని ఎప్పుడైనా తాగారా?

ఈ ప్రపంచంలో ఎవరి టేస్ట్ వారిది.ఇలాగే తినాలని, లేదంటే ఇలాగే తాగాలని ఏమీ లేదు.

ఇక ఆహార ప్రేమికులు మేకర్స్ అయితే వారు చేసిన ఎక్సపెరిమెంట్స్ అన్నీఇన్నీ కావు.

తాజాగా కొబ్బరి బోండాకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా కొబ్బరి బొండం అనేది ఆరోగ్య రీత్యా చాలామంది తీసుకుంటున్న పానీయం అని చెప్పుకోవచ్చు.

పైగా ఇపుడు వేసవి స్టార్ట్ అయింది కనుక వీటి హవా ఎక్కువగా ఉంటుంది.

ఇక దీనిని ఎవరన్నా డైరెక్ట్ గానే తీసుకుంటారు.అందులో ఏమీ కలపరు.

"""/" / అవును, మీరు ఎపుడైనా కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగారా? అయ్యో అలాంటి ఐడియానే తట్టలేదండి అని అనుకుంటున్నారా? ఇదిగో ఇక్కడ ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన పోస్ట్ చూస్తే ఒక రోడ్‌సైడ్ స్టాల్స్‌లో కొబ్బరి నీళ్లను విక్రయించడం గమనించవచ్చు.

అరుణ్‌ దేవ్ అనే ఓ ట్విటర్‌ యూజర్‌.తాను కొబ్బరి బోండాంలో నిమ్మరసాన్ని కలుపుతూ దిగిన ఓ ఫొటోను తన మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేయగా అది కాస్త వైరల్ అయింది.

ఆ ఫొటోకు ‘ఇది ఇంత పాపులర్‌ కాంబినేషన్‌ అని నాకు ఇప్పటిదాకా తెలియదు’ అంటూ ఇంగ్లిష్‌లో క్యాప్షన్‌ కూడా ఇవ్వడం కొసమెరుపు.

"""/" / కాగా.ఈ ఫొటో ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

ఇప్పటికే ఈ ఫొటోను దాదాపుగా రెండు లక్షల మంది వీక్షించగా సుమారు పది వేల మంది లైక్‌ చేయడం విశేషం.

అంతేకాకుండా ఆ పోస్టుని ఉద్దేశించి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కొబ్బరి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగటం ఇదే తొలిసారిగా చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

టేస్టీగా ఉంటుందా? కొందరు అడిగితే, ఇంకా కొబ్బరి బోండంలో ఏం జోడించవచ్చని కొందరు, అడుగుతున్నారు.

ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.‘ఈ కాంబినేషన్‌ చాలా బాగుంటుంది.

మంగళూరులో దీన్ని బోంబా లైమ్‌ అంటారు’ అని కామెంట్‌ చేశాడు.

అమ్మమ్మ చేసిన దారుణం.. 37 ఏళ్ల తర్వాత చైనీస్ కపుల్‌కు విముక్తి..?