వైరల్: కుక్కకి ఇంజెక్షన్.. నాకే పొడుస్తావా అంటూ కుక్క వెంబడింపు!

ఈమధ్యకాలంలో సోషల్ మీడియా ప్రభావం జనులమీద ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియని విషయమే.

ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం వలన సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందింది.

ఈ క్రమంలో అనేక రకాల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.అందులో ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

అందులోనూ పెంపుడు జంతువు అయినటువంటి కుక్కల వీడియోలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి.కుక్కలు చాలా విశ్వసనీయమైన జంతువులు.

అవసరమైనప్పుడు తమ యజమానుల కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయగల విశ్వాసం వీటి సొంతం.

అయితే ఇటీవల కాలంలో అధిక మంది కుక్కల కాటుకు గురవుతున్నారు.దీంతో శునకాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా కుక్కను పెంచుకోవద్దని కూడా సలహా ఇస్తున్నారు.

అయినప్పటికీ కుక్కలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.తాజాగా కుక్క కాటుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఈ కుక్కకు సంబంధించిన చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఇపుడు మీతో షేర్ చేసుకుంటున్నాం.

ఇంకెదుకాలస్యం ఇక్కడ వీడియో చూసి పగలబడి నవ్వేయండి మరి. """/"/ ఇక్కడ వీడియోలో.

కుక్క యజమానులు దానికి కాస్త సుస్తీ చేయడంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లినట్టుగా కనబడుతోంది.

కుక్క యజమానులు తమ పెంపుడు కుక్కను గట్టిగా పట్టుకోగా పశువుల డాక్టర్ ఆ కుక్క వెనకాల దాక్కొని మరీ వెనుక నుండి ఇంజెక్షన్ చేశాడు.

ఇలా ఇంజెక్షన్ చేసి.వేగంగా ఇంటి నుండి బయటకు పరిగెత్తాడు.

తరువాత ఇంటి గేటు తలుపును మూసివేశాడు.అయితే కుక్క తనకు ఇనెక్షన్ చేసిన చేసిన వ్యక్తిమీద కోపంతో అతని వెంట పరిగెత్తింది.

గేటు దగ్గర ఆగి అరవడం మనకు కనిపిస్తుంది.అయితే ఆ వ్యక్తి పట్టుబడి ఉంటే.

అతడి సంగతి అంతేమరి కదూ!.

RC 16 నుంచి తప్పుకున్న రెహమాన్… క్లారిటీ ఇచ్చిన మేకర్స్?