వావ్, ఈ చిన్నారి ఎంత క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుందో.. వీడియో చూస్తే ఫిదా!
TeluguStop.com
గుజరాత్‌లోని( Gujarat ) అహ్మదాబాద్‌కు చెందిన అన్య రాహుల్ పటేల్( Aanya Rahul Patel ) అనే చిన్నారి తన అద్భుతమైన డ్యాన్స్ వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది.
ఇటీవల ఈ చిన్నారి సనమ్ పూరి పాడిన "యే రాతేన్ యే మౌసం"( Yeh Raaten Yeh Mausam ) పాటకు చాలా క్యూట్ గా డ్యాన్స్ చేసింది.
ఆమె డ్యాన్స్ వీడియో ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తోంది.సాధారణంగా తన వీడియోల్లో ఎంతో ఉత్సాహంగా స్టెప్స్ వేసే అన్య ఈసారి మాత్రం చాలా సింపుల్‌గా డాన్స్ చేసింది.
ఎర్రటి దుస్తులు ధరించి పరుపు మీద కూర్చుని, తన ముఖ కవళికలతోనే( Facial Expressions ) పాటకు ప్రాణం పోసింది.
సంగీతానికి అనుగుణంగా తన ఎక్స్‌ప్రెషన్స్ ముఖం ద్వారా వ్యక్తపరచడం ఆమె డాన్స్‌లోని ప్రత్యేకత.
అన్య పాటను చాలా ఇష్టంగా లిప్-సింక్ చేసింది.చాలా సింపుల్‌గా చేతులతో కొన్ని అందమైన అభినయాలు చేస్తూనే, తన ముఖ కవళికలతోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఆ పాట ఈ చిన్నారికి చాలా ఇష్టం ఉన్నట్టు ఉంది.ఆమె భావాలను ముఖం ద్వారా ఎంత బాగా వ్యక్తపరుస్తుందో ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.
"""/" /
వీడియో మొదట్లో అన్య ఎర్రటి దుస్తులు ధరించి పరుపు మీద కూర్చుని ఉంటుంది.
ఆమె జుట్టు లూజ్ గా వదిలేసింది.సంగీతం మొదలవుతున్నాక, ఆమె తన ముఖ కవళికలతో సంగీతానికి తోడుగా అద్భుతంగా నటించింది.
అన్య తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను ఇటీవలే పోస్ట్ చేసింది.ఈ వీడియో చాలా త్వరగా వైరల్ అయింది.
ఇప్పటికే దీనిని తొమ్మిది లక్షల మందికి పైగా చూశారు. """/" /
50,000 కి పైగా లైక్‌లు వచ్చాయి.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆమె ప్రదర్శనను ప్రశంసిస్తూ, హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేశారు.
అన్య చాలా సింపుల్‌గా ఎన్నో ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.అన్య వీడియో చూసిన ఒక యూజర్ "మనం ప్రేక్షకుల్లో ఒక శాశ్వతమైన ముద్ర వేయాలంటే క్లిష్టమైన డాన్స్ స్టెప్‌లు అవసరం లేదు.
పాటతో ఆమె కనెక్ట్ అయిన తీరు, ఆమె ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ నా హృదయాన్ని గెలుచుకున్నాయి.
" అని రాశారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
బాలయ్య రామ్ చరణ్ అండ తో శర్వానంద్ హిట్టు కొట్టబోతున్నాడా..?