వైరల్: ‘అంగ్ లగా దే’ పాటకు డ్యాన్స్ ఇరగదీసిన కపుల్స్!

సోషల్ మీడియాలో ఎన్ని రకాల వీడియోలు వైరల్ అయినా, డాన్స్ కి సంబందించిన వీడియోల హవానే వేరు.

అవును, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత గల్లీకొక కళాకారుడు బయటకి వస్తున్నాడు.

భారతీయ సినిమాలలో ( Indian Cinema )సంగీతానికి పెద్దపీట వేస్తారు.ముఖ్యంగా వినసొంపైన సాహిత్యంతో కూడిన పాటలు ఇక్కడ కోకొల్లలుగా ఉంటాయి.

అందులో సూపర్ హిట్ సాంగ్స్‌కి ఔత్సాహికులు డ్యాన్సులు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇక్కడ చాలా ఫేమస్ అవుతూ వుంటారు.

"""/" / అవును, కొన్ని పాటలకు మనోళ్లు వేసే స్టెప్పులు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా రామ్-లీలా సినిమాలోని అంగ్ లగా దే( Ang Laga De ) పాటకు ఓ జంట వేసిన అందమైన స్టెప్పులు నెటిజన్ల మనసులను దోచుకుంటున్నాయి.

సోషల్ మీడియా ప్రతిభ ఉన్నవారికి ఇపుడు మంచి వేదికగా మారింది.దాంతో ఇక్కడ చాలా హిట్ సాంగ్స్‌కి సోలోగా, జంటగా డ్యాన్స్ చేస్తూ చాలా ఫేమస్ అవుతున్నారు.

దాంతో బోలెడు ప్రజాదరణ పొందడంతో పాటు డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్న పరిస్థితి వుంది.

అందులో కొన్ని వీడియోలు( Videos ) అయితే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. """/" / అలాంటి క్లిప్‌ల మధ్య మరో డ్యాన్స్ వీడియో వైరల్( Dance Video ) కావడం మనం ఇక్కడ గమనించవచ్చు.

రామ్-లీలా సినిమాలోని 'అంగ్ లగా దే' పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఈ పాటకు ఓ జంట ఎంతో హృద్యంగా డాన్సు వేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్సర్ ఇషా శర్మ ఈ వీడియోని షేర్ చేయగా వెలుగు చూసిందని చెప్పుకోవాలి.

ఓ జంట ఓ స్టూడియోలో ఈ పాటకు అదిరిపోయే డాన్సు వేయడం ఇక్కడ చూడవచ్చు.

పాట మొదలు కాగానే బీట్‌కి తగ్గట్లు స్టెప్పులు వేసి అందర్నీ మెస్మరైజ్ చేశారు ఆ జంట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై18, గురువారం 2024