వైరల్: కరోనా తిప్పలు, చైనాలో ఓ జంట వింత ముసుగు... బతికేందుకు కుక్కపాట్లు?

చైనాలో పురుడు పోసిన కరోనా వైరస్ చైనాపైనే ప్రతాపాన్ని చూపిస్తోందా? అవునంటున్నారు కొంతమంది విశ్లేషకులు.

BF-7 వేరియంట్ ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో విజృంభిస్తోంది.కాగా మొన్నటి వరకు చాలా కట్టుదిట్టమైన లక్డౌన్ విధించగా.

ప్రజలు తిరగబడటంతో దాదాపు 37 మిలియన్ల మంది ప్రజలు ఈ వారంలో అక్కడ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కొన్ని వందల మంది మృత్యువాత పడుతున్నారు.దాంతో అక్కడ శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.

ఈ కారణంగా లాక్డౌన్ ఎత్తేయమని చెప్పిన అక్కడి ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు.

ఇక ఈ సందర్భంగా వినూత్న రీతిలో కరోనా నుంచి రక్షించుకునేందుకు చైనా దేశ ప్రజలు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.

ఈ క్రమంలో ఓ జంట మార్కెట్‌లోకి వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.దాంతో సదరు వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది.

విషయం ఏమంటే ఓ జంట కూరగాయలు కొనేందుకు స్థానిక మార్కెట్టుకి వచ్చారు.అందరిలా వస్తే ఇక్కడ వాళ్ళ గురించి చెప్పుకొనేవాళ్ళం కాదు.

వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పెద్ద పథకమే వేశారు.ఓ ప్లాస్టిక్ కవర్ ని వారిద్దరూ కవర్ చేస్తూ పైన గొడుగుకి తగిలించారు.

దాంతో ఆ కవర్ వారికి ఒక గదిలాగా ప్రొటెక్షన్ ఇస్తోంది.అంటే ఓ పొడవాటి ప్లాస్టిక్ షీట్‌ను గొడుగువలే చేసుకున్నారు.

వారు బయటకి రాకుండా కవర్లోనే ఉండి కావాల్సిన సరుకులను కొనుక్కోవడం ఇందులో గమనించవచ్చు.

కాగా ఈ జంట వినూత్న చర్యను చూసి నెటిజన్లు మాత్రమే కూండా స్థానికులు కూడా ఆశ్చర్యపోవడం ఇక్కడ గమనించవచ్చు.

వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన