భారతీయులను గెలికిన చైనీస్ మహిళ.. ఏకపారేస్తున్న నెటిజన్లు..

భారతీయులు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్లినా కనిపిస్తారు.భారతీయుల తాకిడి ఎక్కువ అవుతుందని అభివృద్ధి చెందిన దేశాల్లోని స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు భారతీయులు ఉద్యోగాలు ఇతర ఉపాధి అవకాశాలను తమ నుంచి లాగేస్తున్నారని అంటారు.

అయితే ఇండియన్స్ కెనడాలో ఎక్కువవుతున్నారని ఇటీవల కాలంలో బాగా విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఒక చైనీస్ మహిళ ఇండియన్స్ గురించి ఎగతాళిగా మాట్లాడింది.

ఆమె కెనడాలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం థియరీ టెస్ట్ ఇస్తున్న సమయంలో తన ఫోన్‌తో వీడియో తీసింది.

ఆమె సన్‌గ్లాస్‌లు పెట్టుకుని వీడియో తీస్తుండగా, తన చుట్టూ చాలామంది భారతీయులు ఉన్నందుకు ఆశ్చర్యపోయింది.

"""/" / ఈ మహిళ తీసిన వీడియో సోషల్ మీడియా( Social Media)లో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో, కెనడా( Canada )లో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష రాసే సెంటర్ మొత్తం భారతీయులతో నిండిపోయి ఉంది.

ఈ దృశ్యాన్ని చూసి ఆ మహిళ చాలా వ్యంగ్యంగా మాట్లాడింది.ఆమె ఇది చాలా చెడ్డ పరిస్థితి అని అన్నది.

తన స్నేహితురాలుతో కలిసి మాట్లాడుతూ, ఇది కెనడా కాదు, భారత్‌లో ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పింది.

ఎక్కడ చూసినా ఇండియన్సే ఉన్నారు అని అంటూ వాటిని పురుగుల లాగా ట్రీట్ చేసింది.

"""/" / ఈ వీడియోను చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది కెనడాలో భారతీయుల సంఖ్య పెరుగుతోందని అంగీకరిస్తున్నారు.

మరొకరు, కెనడాలో చైనీయుల సంఖ్య కూడా ఎక్కువే అని గుర్తు చేస్తున్నారు.ఆ మహిళ తన అనుభవాన్ని పంచుకుంటూ "కెనడాలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం థియరీ టెస్ట్ కు వెళ్ళినప్పుడు నా చుట్టూ అంతా భారతీయులే ఉన్నారు.

ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది.ఇక్కడ పరిస్థితి చూస్తుంటే భారతదేశంలో ఉన్నానా అని అనుకునేలా ఉంది.

ఈ విషయం మీకు అర్థమయ్యేలా ఒక ఫోటో తీశాను." అని చెప్పింది.

ఈ వీడియో చూసిన ఒక వ్యక్తి 'కొన్ని నెలల క్రితం కెనడాలో ఉన్నాను.

అక్కడ చాలా మంది భారతీయులు ఉన్నారని నేను కూడా అంగీకరిస్తున్నాను.కానీ మిగిలిన తెల్లజాతి కెనడియన్లు చాలా మంచివారే.

కానీ అదే సమయంలో తమకు అన్యాయం చేసుకుంటున్నారు.' అని అన్నాడు.

మరొకరు 'కొన్ని సంవత్సరాల క్రితం వ్యాంకూవర్‌కు వెళ్లాను.అక్కడ జనాభాలో సుమారు 40% మంది చైనీస్ ( Chinese )వలస వచ్చినవారు.

కాబట్టి ఆ మహిళ కూడా తమ దేశానికి తిరిగి వెళ్లాలి.ఆమె వేరే దేశంలో కి రావడమే కాకుండా చాలా ఎక్స్‌ట్రా మాట్లాడేస్తోంది' అని అన్నారు.

"ఒక వలస వచ్చిన వ్యక్తి వేరే వలస వచ్చినవారి గురించి ఫిర్యాదు చేస్తున్నారు.

హాహా.చాలా ఫన్నీగా ఉంది.

" అని ఇంకొంతమంది ఆమెకు బుద్ధి చెప్పారు.