వైరల్: జెలెన్‌స్కీ పుతిన్ పేర్లను కలిపేస్తూ పలికిన బైడెన్… మళ్ళీ తడబడ్డారంటూ వైరల్!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) కి వయస్సు అయిపోయిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.

అవును, బైడెన్ మరోసారి పెద్ద పొరపాటు చేశారు.లిథుయానియాలో జరుగుతున్న నాటో సదస్సులో ప్రసంగిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురించి మాట్లాడుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఆయన నోటినుండి కొన్ని పొరపాట్లు దొర్లాయి.ఈ క్రమంలో జెలెన్స్కీ బైడెన్ పక్కనే నిలబడి ఉండడం కొసమెరుపు.

విషయం ఏమిటంటే ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకొచ్చిన జో బైడెన్, జెలెన్స్కీ పేరుని పుతిన్ పేరుని కలిపి పలకడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.

నిజానికి జెలెన్స్కీజెలెన్స్కీ పూర్తి పేరు వోలోదిమిర్ జెలెన్స్కీ .అదేవిధంగా రష్యా అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్.

ఈ పేరు విషయంలోనే బైడెన్ కన్ఫ్యూజ్ అయ్యారు. """/" / విషయం ఏమంటే, వ్లాదిమిర్ పుతిన్ పేరులోని వ్లాదిమిర్ ని జెలెన్స్కీ( Volodymyr Zelenskyy ) పేరుతో కలిపేశారు.

అంటే వ్లాదిమిర్ జెలెన్స్కీ అని పిలిచారు."నేను వ్లాదిమిర్ మాట్లాడుకున్నాం" అని అన్నారు.

ఆ వెంటనే తన తప్పు తెలుసుకున్న బైడెన్ సరి చేసుకోవడం జరిగింది.నిజానికి ఉక్రెయిన్లోని వ్లాదిమిర్ అనే పేరుని తరచూ వాడతారు.

కానీ.దాన్ని జెలెన్స్కీ పేరుకి జోడిస్తూ బైడెన్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దాంతో నెటిజన్లు బైడెన్ పైన సెటైర్లు వేస్తున్నారు. """/" / కొంతమంది "అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇక రిటైర్ అయిపోవడం మంచిది.

" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొంతమంది "బైడెన్ కి వయస్సు అయిపోయింది.

ఆ విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు." అని కామెంట్స్ చేస్తున్నారు.

మరొక నెటిజన్ స్పందిస్తూ."ఇలాంటి ఘోరమైన స్పీచెస్ వినడం కన్నా దారుణం ఇంకొకటి ఉండదు.

కేవలం పొలిటికల్ చరిష్మా కోసం ఆయన ప్రెసిడెంట్ గా ఉంటున్నారంతే" అంటూ మండి పడ్డాడు.

ఇకపోతే గతంలో కూడా ఓ సారి బైడెన్ ఉక్రెయిన్ ప్రజల గురించి ప్రస్తావిస్తూ ఉక్రేనియన్స్కి( Ukraine ) బదులుగా ఇరానియన్స్ అని అన్నారు.

అప్పట్లో ఆ వీడియో కూడా తెగ వైరల్ అయింది.ఇలా తరచూ నోరు జారి నవ్వుల పాలవుతున్నారు బైడెన్.

ఇటీవలే చైనాను పొగిడి విమర్శలు ఎదుర్కొన్న బైడెన్.ఇప్పుడు మరోసారి వింత వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.

ట్రక్కుతో వైట్‌హౌస్‌లో విధ్వంసానికి కుట్ర .. తెలుగు యువకుడికి జైలు శిక్ష