వైరల్: దారుణం, పదేళ్ల చిన్నారిపై దాడి చేసిన కుక్క.. ఏకంగా 200 కుట్లు!

ఈమధ్య కాలంలో చిన్నపిల్లలపై కుక్కలు దాడిచేసే సంఘటనలను ఎక్కువగా చూస్తున్నాం.2 రోజుల క్రితం UPలోని ఘ‌జియాబాద్‌, నోయిడాలో చిన్నారుల‌పై కుక్క‌లు దాడిచేసిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే ఘ‌జియాబాద్‌లో మ‌రొక ఘోర సంఘ‌ట‌న చోటుచేసుకోవడం చాలా బాధాకరం.

తాజాగా ప‌దేళ్ల చిన్నారిపై ఓ పిట్‌బుల్ డాగ్ విచ‌క్ష‌ణార‌హితంగా దాడిచేసింది.ఆ బాలుడి ముఖంపై ప‌ల‌చోట్ల కరవడంతో అత‌డి ముఖంపై దాదాపు 200 పైగా కుట్లు పడినట్టు సమాచారం.

కాగా దీనిని సంబంధించినటువంటి వీడియో ఒకటి నెట్టింట వైర‌ల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే, అది ఓ పిట్‌ బుల్ జాతికి చెందిన కుక్క.

ఉత్తరప్రదేశ్‌, ఘజియాబాద్‌లోని తన ఇంటి సమీపంలోని పార్కులో ఆడుకుంటున్న 10 ఏళ్ల బాలుడిపై పెంపుడు పిట్ బుల్ దాడి చేసింది.

ఈ దాడిలో బాలుడి ముఖానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి.ఈ ఘటనకు సంబంధించిన సన్నివేశం అక్కడున్న CCTV ఫుటేజీలో రికార్డ్ అవ్వగా బయటపడింది.

కుక్క బాలుడిపై తీవ్రంగా విరుచుకుపడటం కనిపించింది.ఓ బాలిక కుక్కను తీసుకొని పార్కులో నడుస్తుండగా.

అకస్మాత్తుగా పిల్లవాడిపై దాడి చేసింది.ఈ సమయంలో ఒక వ్యక్తి పరుగున వచ్చి పిల్లవాడిని రక్షించాడు.

అయితే అప్పటికే.ఆ పిల్లాడు ముఖంలోని కొంత భాగాన్ని కుక్క కొరికేసినట్లు స్థానికులు వెల్లడించారు.

దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు.ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేకుండా జంతువును ఉంచిన కుక్క యజమానికి రూ.

5,000 జరిమానా విధించినట్టు భోగట్టా.సెప్టెంబరు 3న జరిగిన దాడి తర్వాత స్థానికులు యజమానిపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

పిల్లలు ఆడుకోవడానికి వెళ్లే పార్కుల వద్ద జంతువులను విడిచిపెట్టడం సరికాదంటూ పేర్కొంటున్నారు.కాగా.

యూపీలో పెంపుడు కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయి.ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల పెంపుడు కుక్కల దాడికి సంబంధించిన రెండు దిగ్భ్రాంతికరమైన సంఘటనలు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

జిమ్మీకార్టర్‌ను జిమ్మీ కానర్స్‌‌గా పలికిన ట్రంప్.. ఆడుకుంటున్న నెటిజన్లు