కాలిఫోర్నియాలో కార్చిచ్చు: ప్రమాదకర స్థితిలో 10,000 చెట్లు.. తొలగించక తప్పదట..!!!

గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి.గతం సంగతి పక్కనబెడితే.

గత రెండేళ్లుగా ఈ దావాగ్ని లక్షలాది హెక్టార్ల అటవీని కాల్చిబూడిద చేసింది.ఇదొక్కటే కాదు దీని వల్ల వన్య ప్రాణులు సైతం బూడిద కుప్పగా మారాయి.

ఇక ఇళ్లు , ఆస్తులు, వాహనాలు కోల్పోయి నిరాశ్రయులైన వారి సంఖ్య లెక్కేలేదు.

ఈ నేపథ్యంలో శీతాకాలం, వేసవి కాలం నాటికి మళ్లీ కార్చిచ్చులు రేగకుండా, రేగినా నష్టం తక్కువగా వుండేలా అమెరికా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో గతంలో మంటల్లో పాక్షికంగా కాలిపోయి వుండటం, వ్యాధుల బారినపడటం, వయసు పైబడిన దాదాపు 10,000 చెట్లను తప్పనిసరిగా తొలగించాలని నిపుణులు చెబుతున్నారు.

దీంతో ప్రపంచంలోని అతిపెద్ద సీక్వోయా చెట్లను చూసే అవకాశం సందర్శకులకు కొన్ని రోజులు వుండదని సమాచారం.

ఈ సమీపంలోని రహదారిని మూసివేయాల్సి రావడమే ఇందుకు కారణం.జనరల్ హైవే అని పిలవబడే స్టేట్ రూట్ నెంబర్ 180 మార్గంలోని వ్యక్తులు, కార్లపై ఈ ప్రమాదకర చెట్లు పడిపోవచ్చని, అంతేకాకుండా కార్చిచ్చుల వంటి అత్యవసర సమయాల్లో సహాయక చర్యలకు అడ్డంకులు సృష్టించవచ్చని సీక్వోయా, కింగ్స్ కాన్యన్ నేషనల్ పార్కుల నిర్వాహకులు తెలిపారు.

ఇప్పటికే కేఎన్‌పీ కాంప్లెక్స్‌లో మంటల కారణంగా హైవేను మూసివేశారు.138 చదరపు మైళ్ల అడవికి అగ్నికి ఆహుతి కావడంతో ప్రస్తుతం కేవలం 60 శాతం మాత్రమే కలిగి వుంది.

పాడైపోయిన చెట్లను సిబ్బంది నరికివేసే సమయంలో సందర్శకులను నిలిపివేశారు.కేఎన్‌పీ కాంప్లెక్స్ సెప్టెంబర్ 9 నుంచి తగులబడుతోంది.

పిడుగుపాటు కారణంగా ఇక్కడ కార్చిచ్చు రేగింది.కాలిఫోర్నియాలోని గైయింట్‌ అడవులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే.

వీటిని చూడటానికి ప్రతియేటా ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది ప్రకృతి ప్రేమికులు తరలివస్తుంటారు.

అలాంటి గైయింట్‌ అడవిలో సెప్టెంబర్ 18న ఒక్కసారిగా కార్చిచ్చు రగిలి వేల ఏళ్ల నాటి మహా వృక్షాలను సైతం కబళించబోయింది.

అయితే అగ్నిమాపక సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై ఆ విధ్వంసాన్ని అడ్డుకున్నారు.వందలాంది మంది అగ్నిమాపకు సిబ్బంది సుమారు మూడువేల ఏళ్ల నాటి మహా వృక్షాలను అగ్నికి ఆహుతి కాకుండా తమ సర్వసక్తులు ఒడ్డి కాపాడారు.

"""/"/ సీక్వొయా నేషనల్‌ పార్కులో ఉన్న ప్రపంచపు అతిపెద్ద వృక్షం జనరల్‌ షెర్మన్‌ను కాపాడేందుకు ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమించారు.

ఈ మహావృక్షం కాండం అడుగుభాగానికి వేడిని నిలువరించగల అల్యూమినియం రేకును చుట్టారు.ఈ మహావృక్షం ఎత్తు 275 అడుగులు, చుట్టుకొలత 103 అడుగులు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, పర్యావరణ వేత్తలు అగ్నిమాపక సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

గైయింట్‌ అడవిలో దాదాపు రెండు వేల ఏళ్ల నాటి మహా వృక్షాలు ఉండగా.

అందులో ఒక ఐదు వృక్షాలు దాదాపు 3 వేల ఏళ్ల క్రితం నాటివని వృక్షశాస్త్ర నిపుణులు తెలిపారు.

అంతేకాదు ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద వృక్షాలు.వీటి పొడవు 83 మీటర్లు (275 అడుగులు).

చిరంజీవి హిట్ సినిమాను రీమేక్ చేస్తున్న స్టార్ హీరో…