వైర‌ల్‌.. ఈ ప‌క్షికి కోపం మామూలుగా లేదుగా..

అప్పుడప్పుడు మ‌నం కొన్ని వీడియోలు, ఫొటోలు చూస్తుంటే మ‌న కండ్ల‌ను మ‌న‌మే న‌మ్మ‌లేక‌పోతుంటాం.

కొన్ని సార్లు మ‌నుషుల్లాగే జంతువులు ప్ర‌వ‌ర్తించ‌డం మ‌నం చాలానే చూస్తున్నాం.ఎందుకంటే మ‌నుషుల మ‌ధ్య‌నే ఉండే కార‌ణంగా చాలా వ‌ర‌కు జంతువులు, ప‌క్షులు కూడా ఇలాగే చేస్తున్నాయి.

ఈ మ‌ధ్య మ‌రీ ఎక్కువ‌గా ఎమోషన్స్ కూడా చూపించేస్తున్నాయండి.చాలా సార్లు చిల‌క‌లు మాట్లాడ‌టం మ‌నం కూడా చూస్తున్నాం.

మొన్న‌టికి మొన్న బాతు కూడా ఇలాగే ప‌లుకులు ప‌ల‌క‌డం చూశాం.అయితే ఇప్పుడు కూడా ఓ ప‌క్షి గురించే చెప్పుకోబోతున్నాం.

నిజానికి ఈ ప‌క్షిని చూస్తే అచ్చం చిలుక‌లాగే ఉన్నా కూడా అది తెల్ల‌ని రంగులో ఉండ‌టం మూలాన అది వేరే ప‌క్షి అని అర్థం అవుతోంది.

కాగా ప‌క్షుల‌కు అస‌లు కోపం అనేది ఉంటుందా అనేది ఓ పెద్ద ప్ర‌శ్న‌.

ఎందుకంటే మ‌నం చాలా సార్లు కోపం అనేది జంతువులలో మాత్రమే ఎక్కువ‌గా చూస్తుంటాం.

కానీ ఇప్పుడు ఓ ప‌క్షి కూడా చాలా కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.ఇలా పక్షుల్లో కోపం అనేది కనిపించ‌డం చాలా అరుదుగానే ఉంటుంది.

అయితే ఈ వీడియో చూసిన త‌ర్వాత మీకు నిజ‌మే అనిపిస్తుంది.ఈ వీడియోలో ఓ పెద్ద ప‌క్షి మ‌న‌కు క‌నిపిస్తుంద‌తి.

అయితే అది ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌ట్టుకున్న చేప ఆహారాన్ని ఓ ఇంటి మధ్యలోకి తీసుకొచ్చే పడేస్తుంది.

ఆ చేప కూడా కొంచెం పెద్ద‌గానే మ‌న‌కు క‌నిపిస్తుంది.కాగా దీన్నంతా కూడా వీడియో తీస్తున్న ఆ ఇంటి య‌జ‌మాని ఆ చేపను పట్టుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం మ‌నం చూడొచ్చు.

కానీ ఇంత‌లో ఆ ప‌క్షి ఆ చేప మీద నిల్చుని ఇది నాది నువ్వు ఎందుకు ముడుతున్నావ్ అన్న‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం క‌నిపిస్తుంది.

కాగా ఆ య‌జ‌మాని మ‌రోసారి లాక్కోగా ఈ సారి మ‌రింత కోపానికి గురైన ఆ ప‌క్షి య‌జ‌మాని వేలి మీద క‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.

దీన్ని చూసిన నెటిజ‌న్లు ఆ ప‌క్షికి ఎంత కోప‌మో అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

వైరల్ వీడియో.. సునీల్ గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి