వైరల్: కోపంతో కండక్టర్ పై పామును విసిరిన వృద్ధురాలు..

మామూలుగా మనం బస్సు ప్రయాణం చేయాలన్నప్పుడు ఎక్కడైనా సరే వెళ్తున్న బస్సులో ఆపడానికి చెయ్యి ఎత్తితే చాలు బస్సును డ్రైవర్ ఆపేస్తాడు.

ఒకవేళ బస్సులో రద్దీ ఎక్కువగా ఉంటే కేవలం బస్టాప్ వద్ద మాత్రమే ఆపుతూ వెళ్తూ ఉంటారు.

అయితే ఇలాంటి వాటిని అర్థం చేసుకోకుండా కొందరు వ్యక్తులు బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగడం మనం చూస్తూనే ఉంటాము.

మరి కొందరైతే గొడవలకు సైతం దిగి దాడులు చేయడం మీడియా ద్వారా చూస్తూనే ఉంటాము.

ఇకపోతే ఫ్రీ బస్ ( Free Bus)పథకం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక వింత ఘటన చూసినట్లే జరుగుతూనే ఉంది.

"""/" / ముఖ్యంగా ఆడవారు బస్సులో సీటు కోసం తలలు పట్టుకొని కొట్టుకోవడం, అలాగే చిల్లర ఇవ్వలేదంటూ ఇంకా ఇలా అనేక సంఘటన మధ్య బస్సు ప్రయాణం సాగుతూ ఉన్నాయి.

ఈ నేపథంలో బస్సు డ్రైవర్ కు, కండక్టర్ కు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇకపోతే తాజాగా హైదరాబాదులో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

"""/" / హైదరాబాద్( Hyderabad ) మహానగరంలోని విద్యానగర్ లో ఉంటున్న వృద్ధురాలు కాస్త వింతగా ప్రవర్తించింది.

బస్సును ఆమె ఆపమన్నచోట ఆపలేదంటూ కండక్టర్ పై రెచ్చిపోయింది.విద్యనగర్( Vidyanagar ) దగ్గర బస్సు పై ఆమె బీర్ బాడీలతో దాడి చేయగా బస్సు వెనకాల అద్దం పూర్తిగా దెబ్బతినింది.

దాంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపి ఆమెతో వాగ్వాదానికి దిగింది.ఈ సంఘటనలో ఆవిడ మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

దాంతో పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు ఆమెను సముదాయించే ప్రయత్నం చేయగా.ఆవిడ మరింత రెచ్చిపోయింది.

దాంతో ఆవిడ తాను తెచ్చుకున్న బ్యాగులో ఉన్న పామును తీసి కండక్టర్ వైపు విసిరింది.

దీంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు పెట్టారు.వృద్ధురాలు విసిరిన పాము నేరుగా కండక్టర్ పైన పడి అది పాక్కుంటూ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది.

దీంతో ఒక్కసారిగా కండక్టర్ భయభ్రాంతులకు లోనయింది.

వేపతో వావ్ అనిపించే బ్యూటీ బెనిఫిట్స్.. డోంట్ మిస్!