వైరల్: వెకిలి డాన్సులు వేసి అబాసుపాలైన ప్రబుద్ధుడు?
TeluguStop.com
నేటి దైనందిత జీవితంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో వుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఈమధ్య కాలంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా సముద్రంలో మునిగి తేలుతున్నారు.
గంటల తరబడి సమయం ఎరుకే తెలియకుండా గడిపేస్తున్నారు.ఈ క్రమంలోనే కొన్ని కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో నిత్యం కొన్ని వేల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ అయినప్పటికీ కొన్ని మాత్రమే నెటిజన్లను ఆకట్టుకుంటాయి.
ఈ క్రమంలోనే ఓ వీడియో ఒకటి ట్విటర్ వేదికగా తెగ వైరల్ అవుతోంది.
వీడియోని ఒకసారి గమనిస్తే ఓ టీచర్ తన స్టూడెంట్స్ తో సరదాగా డాన్స్ చేసినట్టు కనబడుతోంది.
అయితే దాన్ని మన నెటిజన్లు సరదాగా మాత్రం తీసుకోలేదు.కాస్త సీరియస్ గానే తీసుకున్నారు.
విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన టీచర్ తాను సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలాంటి వెక్కిలి చేష్టలు వేయడం ఏమిటి? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోలో సదరు టీచర్ 'ఫ్లాటి కమరియా మేరీ' పాటకు విద్యార్థులతో కలిసి డాన్స్ చేయడం గమనించవచ్చు.
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే నెటిజన్లతో పాటు ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఆ వీడియో సోషల్ మీడియాలో కనబడడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి ఇలా సోషల్ మీడియా పిచ్చితో స్టూడెంట్స్ తో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం ఏమిటి అని ఆ పాఠశాల యాజమాన్యానికి ప్రశ్నలు వేస్తున్నారు.
దాంతో ఆ స్కూల్ యాజమాన్యం ఆ టీచర్ పైన క్రమశిక్షణా రాహిత్యం చర్యలు తీసుకున్నట్టు భోగట్టా.
విమర్శల పాలవుతున్న సద్గురు జగ్గీ వాసుదేవ్ పాదం ఫోటో.. మ్యాటరేంటంటే?