నన్ను పాస్ చేస్తే నీకు మా అక్కను ఇస్తా, లేదా మీ చెల్లిని చేసుకుంటా.. బోర్డు ఎక్జామ్‌లో రాతలు
TeluguStop.com
పరీక్షల్లో పాస్ కాలేము అనుకున్నప్పుడు కొందరు విద్యార్థులు రాసే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి.
కొందరు పాటలు, సినిమా స్టోరీలు పరిక్షల్లో రాయడం మనం ఇప్పటి వరకు చూశాం.
మరి కొందరు ప్రశ్న పత్రంను తిప్పి తిప్పి మళ్లీ మళ్లీ రాస్తూ ఉంటారు.
కొందరు తెలివిగా తమకు వచ్చిన ఆన్సర్‌లను రాస్తూ ఉంటారు.మరి కొందరు ఆకతాయిలు మాత్రం నన్ను పాస్ చేసి ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తాను, ఈ నెంబర్‌కు మెసేజ్ చేస్తే మీకు అకౌంట్‌లో డబ్బులు పడతాయి అంటూ రాస్తూ ఉంటారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పదవతరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి.
ఆ పరిక్షల్లో ఎవరికి ఇష్టం వచ్చిన తరహాలో వారు రాసేస్తున్నారు.ముఖ్యంగా కొందరు అబ్బాయిలు మరీ దారుణంగా సమాధానాలు రాస్తున్నారట.
తాజాగా ఉత్తర భారతదేశంలోని ఒక స్టూడెంట్ బోర్డు పరీక్షలో రాసిన విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
సంవత్సరం అంతా చదివిని కుర్రాడు రాసిన సమాధానం అందరు నోరు వెళ్లబెట్టేలా ఉంది.
ఆ కుర్రాడు రాసిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఇంతకు ఆ కుర్రాడు పరీక్షలో ఏం రాశాడో తెలుసా.
నన్ను పాస్ చేయండి, నన్ను పాస్ చేస్తే నాకు ఉన్న స్థలం మీకు రాసిస్తాను, అలాగే మా అక్కను మీరు పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాను అలా మీరు నాకు బావ అవ్వొచ్చు, లేదంటే మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను, అందువల్ల మీరు నాకు బావమర్ది అవ్వొచ్చు.
ఇందులో ఏదైనా నాకు సమ్మతమే.మీకు సమ్మతమే అయితే పాస్ చేయండి అంటూ సమాధాన పత్రంలో రాయడం జరిగింది.
ఇంకో వ్యక్తి మీరు హనుమాన్ భక్తులు అయితే ఇది చూసి అయినా పాస్ చేయండి అంటూ హనుమాన్ చాలీసా మొత్తం నింపేశాడు.
మరో కుర్రాడు నీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది కనుక నీవు నాకు మార్కులు ఇవ్వు అంటూ రాశాడు.