వైరల్: ఇండియాలో అందమైన మంచులో రైలు ప్రయాణం... ఎక్కడంటే!

ఇండియాలో అంత అందమైన రైలు ప్రయాణం, పైగా మంచులో ఎక్కడుంటుంది? అని అనుకుంటున్నారా? నిజంగా అలాంటి అద్భుతమైన ప్రదేశం ఉందండీ.

అది తెలియాంటే మీరు ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.మన ఇండియాలో కొన్ని రూట్లల్లో ట్రైన్ జర్నీ అనేది చాలా హాయిగా అనిపిస్తుంది.

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రైలు ప్రయాణం చేయడమంటే ఎవరికీ ఇష్టం ఉండదు? పైగా మరో వైపునుండి మంచు కురుస్తుండగా రైలులో అలా వెళ్తూ ఉంటే ఆ అనుభవమే వేరు.

న భూతొ న భవిష్యతి అనుకోండి.అక్కడ కూడా అలాగే ఉంటుంది మరి.

ఇలాంటి ఎక్స్‌పీరియెన్స్ కోసం మీరు ఫారిన్ వెళ్లాల్సిన అవసరమే లేదు.భారతీయ రైల్వే ఇలాంటి రూట్లల్లో కొన్ని రైళ్లను ఇపుడు నడుపుతోంది.

అవును, అయితే మీరు మంచులో రైలు ప్రయాణం ఎంజాయ్ చేయాలనుకుంటే జమ్మూ కాశ్మీర్ వెళ్లాల్సిందే.

బారాముల్లా - బానిహాల్ రూట్‌లో ఎల్లప్పుడూ మంచు కురుస్తూ ఉంటుంది.ఈ రూట్‌లో ప్రయాణిస్తూ, మంచు కురవడాన్ని రైలు నుంచే ప్రత్యక్షంగా చూడొచ్చు.

ఓవైపు రైలుపై మంచు కురుస్తూ ఉంటే, మీరు ఆ రైలులో ప్రయాణిస్తుంటే ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది అనుకోండి.

"""/"/ మరెందుకాలస్యం.ఒక టికెట్ యేసుకోండి.

మీకు ఇష్టమైన స్నేహితుల్ని, మీ లైఫ్ పార్ట్నర్ని తీసుకొని వెళ్లి వారికి ఎప్పటికీ మరపురాని బహుమతిని ఇవ్వండి.

ఇకపోతే బనిహాల్ నుంచి బాద్గామ్ రూట్‌లో వెళ్లున్న రైలు వీడియోలను భారతీయ రైల్వే తాజాగా ట్వీట్ చేయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లోని రైల్వే నెట్‌వర్క్ దేశంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న నెట్‌వర్క్.ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన, భారతదేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన కూడా ఇక్కడే నిర్మిస్తుండటం విశేషం.

కాగా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీస్‌లో ఉంటుంది.

వీడియో వైరల్‌: దటీజ్ నీతా అంబానీ.. కన్యాదానం ప్రాముఖ్యత ఎమన్నా చెప్పిందా..