వైరల్: కొండ చిలువతో ఓ ఆటాడుకున్న వ్యక్తి... అవాక్కవుతున్న నెటిజన్లు!

సోషల్ మీడియా అనేక రకాల వీడియోలకు అడ్డాగా మారిపోయింది.అయితే అందులో ఏ కొన్నో నెటిజన్ల మనసులను దోచుకుంటాయి.

వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చిత్రంగా ఉంటాయి.ఇంకొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే.

మరికొన్ని కాస్త జుగుప్సను కలిగిస్తాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియో అయితే ఒకింత జుగుప్సను కలిగించే విధంగా వుంది.

ఓ కుర్రాడు చేసిన పనికి కొందరు అవాక్కవుతున్నారు.ఏం గట్స్ రా బాబు అని మనోడిని తెగ పొగిడేస్తున్నారు.

కొందరు మాత్రం నీకేమైనా పిచ్చా అంటూ అక్షింతలు వేస్తున్నారు.వివరాల్లోకి వెళితే, ఓ భారీ కొండ చిలువు ఓ డ్రైనేజీలోకి ఎలా వచ్చిందో తెలియదు గాని, పెద్ద ఎత్తున వాటర్‌ ఫ్లో రావడంతో ఆ కొండ చిలువకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిని నెలకొంది.

దీంతో నీళ్లలోనే తిరుగుతూ అలా అక్కడే చక్కెర్లు కొడుతోంది.ఇంతలోనే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు యువకులు దానిని కాపడడానికి రంగంలోకి దిగారు.

తాడు సహాయంతో దానిని బయటకు తీయాలని ఓ కుర్రాడు యత్నించగా వాటర్‌ ఫ్లో ఎక్కువగా ఉండడం వలన పైథాన్‌ ఎంతకీ చిక్కలేదు.

"""/"/ దీంతో అక్కడే ఉన్న మరో కుర్రాడు వెంటనే రంగంలోకి దిగి చేతితోనే పామును కేవలం సెకండ్ల వ్యవధిలో పట్టేసుకున్నాడు.

కొండ చిలువ మెడను గట్టిగా తన చేతిలో అదిమిపెట్టి బంధించడంతో ఆ పాము చాలా తేలికగా చిక్కేసింది.

అనంతరం అవతలి వ్యక్తి పాముకు మరలా తాడును కట్టి గట్టిగా బిగించాడు.ఆ తరువాత వెంటనే పామును అవతలికి పారేశాడు పట్టుకున్న వ్యక్తి.

దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

వీడియో చూసిన నెటిజన్లు కొండ చిలువను చేతితో సులభంగా పట్టిన వ్యక్తి ధైర్యానికి సలాం చేస్తున్నారు.

మూడు దేశాలను గడగడలాడించిన వ్యక్తి పాత్రలో యంగ్ టైగర్.. ఆ సినిమా వేరే లెవెల్!