వైరల్: ట్రక్‌లోకి ఎక్కిన కారు.. అలా ఎలా?

సోషల్ మీడియా అనేది ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాక పెను మార్పులు సంభవించాయని చెప్పుకోవచ్చు.

ఈ ప్రపంచంలో ఎక్కడున్న విషయాలన్నా యిట్టె తెలుసుకోగలుగుతున్నాం.అందులోనూ చిత్ర విచిత్రమైన సంఘటనలు అయితే వెంటనే వైరల్ కావడం మొదలు పెడతాయి.

సాధారణంగా రోడ్డుపై మనకు రకరకాల డ్రైవర్లు కనిపిస్తూ వుంటారు.అందులో బలమైన రైడర్లు, హెవీ డ్రైవర్లు.

ఇలా రకరకాల డ్రైవర్లు మనకు కనిపిస్తూ ఉంటారు.వీరు తమ డ్రైవింగ్ నైపుణ్యంతో ఇతర డ్రైవర్లను సైతం ఆశ్చర్య పరుస్తారు అనడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో( Social Media ) చక్కెర్లు కొడుతోంది.

ఇక్కడ మీకు కనబడుతున్న వీడియో ఒక్కసారి నిశితంగా పరిశీలించండి.మహీంద్రా పికప్ బొలెరో డ్రైవర్ తన వెనుక ఓ కారును అమర్చుకున్న విధానం చూడండి.

ఖాళీగా ఉన్న రహదారిపై ఓ మహీంద్రా బొలెరో( Mahindra Bolero ) వేగంగా వెళుతున్నట్లు కనబడుతోంది.

దానిలో ఒక కారుని ఏదో ఫ్రిజ్ లేదా ఇతర ఇంటి సామానులు అమర్చిన మాదిరి అమర్చి తీసుకుని పోతున్నాడు ఓ డ్రైవర్.

అయితే ఆ దృశ్యాన్ని చూసిన ఒకరు ఆశ్చర్యంగా దానిని తన ఫోన్ కెమెరాలో బంధించాడు.

"""/" / కాగా ఈ వీడియో చూసిన వారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఒక కారుని అలా ఎలా అమర్చారు? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే! ఇంత బరువైన కారును అలా ఏదో లగేజ్ మాదిరి ఎలా ఎక్కించగలిగారు అని ఆశ్చర్యపోతున్నారు.

పైగా దానిని జెట్ స్పీడుతో సదరు ట్రక్ డ్రైవర్( Truck ) ఎక్కడికో తీసుకుపోతున్నాడు.

ఈ వీడియోను రాజేష్ అనే అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.

అతను ఆ వీడియోకి ‘నేనే రైడర్.’ అనే క్యాప్షన్‌ను జోడించడం విశేషమే.

98 వేల మందికి పైగా ఈ వీడియోను చూడగా అనేకమంది దానిని లైక్స్ చేస్తున్నారు.

కళ్లముందే నరకం: కార్చిచ్చులో చిక్కుకున్న స్నేహితులు.. భయానక వీడియో వైరల్..