పేటలో రాజ్యాంగ ఉల్లంఘన:ఎమ్మార్పీఎస్

సూర్యాపేట జిల్లా:గత రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద కాంగ్రేస్ నాయకుడు వడ్డే ఎల్లయ్యపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.

ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన వడ్డే ఎల్లయ్యను స్థానికులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు తనపై జరిగిన దాడి గురించి స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా,కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు ఉల్టా బాధితుడైన వడ్డే ఎల్లయ్యపై కేసు పెట్టి జైలుకు తరలించడం అన్యాయమని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ ఖండించింది.

శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాబూ జగ్జీవన్ రావు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు 4గుద్దేటి యల్లయ్య మాదిగ,చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ యాతాకుల రాజన్న మాదిగ మాట్లాడుతూ వడ్డే ఎల్లయ్యపై పోలీసులు అక్రమంగా పెట్టిన తప్పుడు కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించే విధంగా పోలీసుల తీరుందని, బాధితులు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళితే పోలీసులు ఇంకాస్త అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిన్నగాక మొన్న వడ్డే ఎల్లయ్యపై దాడి జరిగిన విషయాన్ని అన్ని పేపర్లు, ఛానళ్లు,సోషల్ మీడియా కవర్ చేశాయని,దాడి జరిగిన విషయాన్ని సమాజం కూడా చూసిందని తెలిపారు.

కానీ,జరిగిన వాస్తవాన్ని స్థానిక మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా పీఏసీఎస్ చర్మన్ ఒట్టే జానయ్య యాదవ్ తప్పుదోవ పట్టిస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మంత్రి చెప్పినట్లే పోలీసులు తప్పుడు కేసులు పెట్టి దళితులను హింసిస్తున్నారని అన్నారు.అందులో భాగంగానే వడ్డే ఎల్లయ్య కేసును మలుపులు తిప్పి బాధితుడైన అతనిపై తిరిగి కేసు నమోదు చేసి జైలుకు పంపించారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధంగా పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించకుండా,పాలకుల పక్షాన ఉంటూ,వారి యొక్క కర్తవ్యాన్ని మరచి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకనైనా పోలీసులు సీసీ పూటేజీలు పరిశీలించి,కొత్త బస్టాండ్ నుంచి తిరుమల గ్రాండ్ హోటల్ వరకు ప్రజలను విచారించి నిజానిజాలు నిగ్గు తేల్చి,నిందితుల మీద చర్య తీసుకోవాలని,వెంటనే నిందితులైన ఒంటెద్దు నిర్మల,బొడ్డు కిరణ్ మరియు వారి అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ,బోడ శ్రీరాములు మాదిగ,ములకలపల్లి మల్లేష్ మాదిగ, దాసరి వెంకన్న మాదిగ,పుట్టల మల్లేష్ మాదిగ, బత్తుల వెంకన్న మాదిగ,ములకలపల్లి రవి మాదిగ, చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ,దైద శ్రీను మాదిగ, చింత వినయ్ బాబు మాదిగ,కొంగర సైదులు మాదిగ,బాధితులు వడ్డే యాదమ్మ,బుర్రి అరుణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రామోజీరావు ఫోటో మా దేవుడి గదిలో ఉంటుంది.. కీరవాణి కామెంట్స్ వైరల్!